భారత జట్టు మహిళా పేసర్ మాన్సి జోషి కరోనా బారిన పడింది. దీంతో ముంబయిలో ఉన్న మహిళా జట్టుతో కలవలేకపోయింది. ఈ విషయాన్ని బీసీసీఐ వెల్లడించింది. దీంతో మాన్సి మహిళా టీ20లో ఆడే అవకాశాన్ని కోల్పోయినట్లు సమాచారం.
ఇటీవలే మూడు మహిళా జట్లతో టీ20 ఛాలెంజ్ లీగ్‌ను నిర్వహించబోతున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ఈ మూడు జట్లకు సారథులుగా హర్మన్ ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, మిథాలీ రాజ్ వ్యవహిరంచనున్నారు. ఈ టోర్నీలో పాల్గొనేందుకు ఇప్పటికే అందరూ ముంబయి చేరుకుని క్వారంటైన్లో ఉన్నారు.
ఈ లీగ్‌లో మాన్సి.. మిథాలీ నాయకత్వం వహిస్తోన్న వెలాసిటీకి ప్రాతినిధ్యం వహిస్తోంది. అయితే ఇప్పుడు ఈమెకు కరోనా సోకడం వల్ల మాన్సి స్థానంలో మేఘనా సింగ్‌ను తీసుకున్నట్లు సమాచారం.