అది 1987 ప్రపంచకప్.. లాహోర్‌లో వెస్టిండీస్- పాకిస్థాన్ మధ్య ఉత్కంఠభరితంగా మ్యాచ్ జరుగుతుంది. చివరి బంతికి ఆరు పరుగులు కొట్టాలి. విండీస్ బౌలర్ వాల్ష్ బౌలింగ్. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న సలీమ్ జాఫర్ క్రీజు నుంచి బయటికొచ్చాడు. అప్పటికీ మూడు సార్లు హెచ్చరించాడు వాల్ష్. అయినా క్రీజు దాటాడు సలీం. ఆ క్షణంలో వాల్ష్ మన్కడింగ్ ద్వారా అతడ్ని ఔట్ చేసుంటే విండీస్ మ్యాచ్ గెలిచేదే. కానీ అలా చేయలేదు క్రీడా స్ఫూర్తితో వదిలేశాడు. ఫలితం స్ట్రైకింగ్ చేస్తున్న అబ్దుల్ ఖాదీర్ సిక్సర్ కొట్టి పాక్‌కు విజయం చేకూర్చాడు. క్రీడాస్ఫూర్తి ప్రదర్శించిన వాల్ష్కు జియా ఉల్ హఖ్ పతకాన్నిచ్చి గౌరవించింది పాకిస్థాన్.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
మన్కడింగ్.... ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇదే హాట్ టాపిక్. సోమవారం రాజస్థాన్, పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో బట్లర్‌ని అశ్విన్ మన్కడింగ్ ద్వారా ఔట్ చేశాడు. ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు మన్కడింగ్ అంటే ఏంటి? ఇలాంటి ఘటనలు ఇంతకుముందు ఎప్పుడు జరిగాయో తెలుసుకుందాం.
- మన్కడింగ్ అంటే ఏంటి?
నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న బ్యాట్స్‌మెన్ క్రీజులో నుంచి ముందుకు కదిలినపుడు బౌలర్ రనౌట్ చేసే విధానాన్ని మన్కడింగ్ అంటారు. బ్యాట్స్‌మెన్ క్రీజులో నుంచి బయటికొస్తున్నపుడు ముందస్తుగా హెచ్చరించాలనేది సంప్రదాయం. అలా కాకుండా ఔట్ చేయడం క్రీడాస్ఫూర్తికి వ్యతిరేకమని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
- తొలిసారి ఎప్పుడు జరిగింది?
మన్కడింగ్ చేసిన తొలి వ్యక్తి భారతీయుడే. 1947 ఆస్ట్రేలియా పర్యటనలో వినోద్ మన్కడ్ తొలిసారి ఈ విధానంలో వికెట్ తీశాడు. అప్పటి నుంచి అతడి పేరు మీద మన్కడింగ్ అని పిలుస్తున్నారు.
- అశ్విన్ ఇంతకు ముందు....
రవిచంద్రన్ అశ్విన్ ఇప్పుడే కాదు గతంలోనూ మన్కడింగ్ విధానాన్ని ఉపయోగించాడు. 2012 ఫిబ్రవరి 21న శ్రీలంకతో జరిగిన కామన్వెల్త్ సిరీస్‌లో తిరిమన్నే వికెట్‌ను ఇలాగే తీశాడు. అప్పుడు సచిన్, సెహ్వాగ్ లాంటి సీనియర్లు వారించగా తన అప్పీల్‌ని వెనక్కి తీసుకున్నాడు.
This old mankading incident of Ashwin proves why Sachin Tendulkar was class apart and a true gentleman. #RRvKXIP pic.twitter.com/uCKP731zwc
— R! (@WeirdlyProbable) March 25, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">This old mankading incident of Ashwin proves why Sachin Tendulkar was class apart and a true gentleman. #RRvKXIP pic.twitter.com/uCKP731zwc
— R! (@WeirdlyProbable) March 25, 2019This old mankading incident of Ashwin proves why Sachin Tendulkar was class apart and a true gentleman. #RRvKXIP pic.twitter.com/uCKP731zwc
— R! (@WeirdlyProbable) March 25, 2019
- కొన్ని మన్కడింగ్ ఔట్లు
- 2014 జూన్ 3న ఇంగ్లండ్ ఎడిన్ బర్గ్ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో బట్లర్ క్రీజు దాటుతుంటే ముందే హెచ్చరిస్తాడు సచిత్ర సేన నాయకే. కానీ బట్లర్ మళ్లీ అలాగే చేసినందున మన్కడింగ్ ద్వారా అతడ్ని పెవిలియన్ చేరుస్తాడు. ఈ అంశంపై ఇంగ్లండ్ కెప్టెన్ కుక్ అప్పటి శ్రీలంక సారథి మ్యాథ్యూస్‌పై విమర్శలు గుప్పించాడు.
- 1992లో దక్షిణాఫ్రికా ఆటగాడు పీటర్ కిర్‌స్టెన్(గ్యారీ కిర్‌స్టెన్ సోదరుడు)మన్కడింగ్ చేసినందుకు అతడిపై విరచుకుపడ్డాడు భారత దిగ్గజం కపిల్ దేవ్.
- 2012 ఇంగ్లీష్ కౌంటీలో సోమర్సెట్ బ్యాట్స్‌మెన్ అలెక్స్ బారోని టాంటన్ గ్రౌండ్లో మన్కడింగ్ చేశాడు మురళీ కార్తీక్. 2013 దేశవాళీ మ్యాచ్‌లో రైల్వేస్ తరఫున ఆడిన కార్తీక్ బెంగాల్ బ్యాట్స్‌మెన్ సందీప్ దానస్ని ఇదే విధానంలో ఔట్ చేశాడు..
.
Did this happen earlier?
— Akash Ranjan Sahoo (@arsahoo17) March 25, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Yes, in 2014 srilanka tour of England the victim was same. @josbuttler. But #suchitra_senanayeka gave warning. Then he got out jos.@ashwinravi99 should learn some spirit of cricket from him😊😊😊.. #VIVOIPL2019 #mankading#RRvKXIP #IPL2019 #engvssl #ipl pic.twitter.com/LCz2CnkQVs
">Did this happen earlier?
— Akash Ranjan Sahoo (@arsahoo17) March 25, 2019
Yes, in 2014 srilanka tour of England the victim was same. @josbuttler. But #suchitra_senanayeka gave warning. Then he got out jos.@ashwinravi99 should learn some spirit of cricket from him😊😊😊.. #VIVOIPL2019 #mankading#RRvKXIP #IPL2019 #engvssl #ipl pic.twitter.com/LCz2CnkQVsDid this happen earlier?
— Akash Ranjan Sahoo (@arsahoo17) March 25, 2019
Yes, in 2014 srilanka tour of England the victim was same. @josbuttler. But #suchitra_senanayeka gave warning. Then he got out jos.@ashwinravi99 should learn some spirit of cricket from him😊😊😊.. #VIVOIPL2019 #mankading#RRvKXIP #IPL2019 #engvssl #ipl pic.twitter.com/LCz2CnkQVs
ప్రస్తుతం అశ్విన్ చర్యను సమర్థించాడు మురళీకార్తీక్. గతంలో రెండు సార్లు మన్కడింగ్ విధానాన్ని అనుసరించాడీ లెగ్ స్పిన్నర్.