వెస్డిండీస్ బౌలర్ కీమర్ రోచ్ అరుదైన ఘనత సాధించాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో 200వ టెస్టు వికెట్ దక్కించుకున్నాడు. శనివారం క్రిస్ వోక్స్(1)ను క్లీన్ బౌల్డ్ చేసిన రోచ్.. విండీస్ తరఫున ఈ ఘనత సాధించిన తొమ్మిదో బౌలర్‌గా రికార్డులకెక్కాడు. 1994లో కర్ట్‌లీ ఆంబ్రోస్ తర్వాత 26 ఏళ్లకు రోచ్ ఈ ఘనత సాధించడం విశేషం. ఈ సందర్భంగా నాటి బౌలర్ ఆంబ్రోస్.. రోచ్‌కు ప్రత్యేకంగా ఓ వీడియో సందేశం పంపాడు. ఐసీసీ ట్విట్టర్లో పంచుకున్న ఆ వీడియోలో రోచ్ ఇలాగే కొనసాగుతూ మున్ముందు 250, 300 వికెట్లు తీయాలని ఆకాంక్షించాడు. రోచ్ 59 టెస్టుల్లోనే 200 వికెట్లు పడగొట్టాడు. అందులో తొమ్మిదిసార్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేయడం గమనార్హం.
జులై 24 శుక్రవారం తొలి రోజు బౌలింగ్ చేసిన రోచ్.. డొమినిక్ సిబ్లీ(0), బెన్ స్టోక్స్(20)ను కూడా పెవిలియన్ చేర్చాడు. శనివారం వెలుతురు సరిగ్గా లేనందున ఆటను నిర్ణీత సమయం కన్నా ముందే నిలిపివేశారు. అప్పటికి ఇంగ్లాండ్ స్కోర్ 258/4గా నమోదైంది. ఒల్లీ పోప్(91), జాస్ బట్లర్ (56) క్రీజులో ఉన్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం ఆటను ప్రారంభించిన కొద్దిసేపటికే ఆతిథ్య జట్టు మూడు వికెట్లు కోల్పోయింది. వచ్చీ రాగానే ఒల్లీ పోప్ అదే స్కోరు వద్ద గాబ్రియెల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. బట్లర్ మరో 11 పరుగులు చేసి (67) పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు. చివర్లో స్టువర్ట్ బ్రాడ్ (62; 45 బంతుల్లో 9x4, 1x6) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడడం వల్ల ఇంగ్లాండ్ 369 పరుగులు చేసి ఆలౌట్ అయింది.
ఇది చూడండి : 'ఆ స్టేడియంలో తెల్లబంతితో ఆడటం కష్టం'