ఇంగ్లాండ్ క్రికెటర్ డేవిడ్ మలన్ అరుదైన ఘనత సాధించాడు. ఐసీసీ తాజా టీ20 ర్యాంకింగ్స్‌లో.. తొలి స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మలన్ మొత్తం 129 పరుగులు చేశాడు. తొలి మ్యాచ్‌లో 66 పరుగులతో 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అందుకున్నాడు. ఈ సిరీస్‌లో అద్భుతంగా రాణించిన ఇంగ్లాండ్ జట్టు 2-1 తేడాతో ట్రోఫీ గెల్చుకుంది.
-
🎉 Dawid Malan rises to No.1 🎉
— ICC (@ICC) September 9, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
The England batsman, who topped the run-scoring charts in the #ENGvAUS series, has jumped four places on the @MRFWorldwide ICC Men's T20I Rankings 🔥 pic.twitter.com/rLvECHFigb
">🎉 Dawid Malan rises to No.1 🎉
— ICC (@ICC) September 9, 2020
The England batsman, who topped the run-scoring charts in the #ENGvAUS series, has jumped four places on the @MRFWorldwide ICC Men's T20I Rankings 🔥 pic.twitter.com/rLvECHFigb🎉 Dawid Malan rises to No.1 🎉
— ICC (@ICC) September 9, 2020
The England batsman, who topped the run-scoring charts in the #ENGvAUS series, has jumped four places on the @MRFWorldwide ICC Men's T20I Rankings 🔥 pic.twitter.com/rLvECHFigb
ఇప్పటివరకు టాప్-1లో ఉన్న పాకిస్థాన్ ఆటగాడు బాబర్ అజామ్.. రెండో స్థానానికి పడిపోయాడు.
గతేడాది నవంబరులో రెండవ స్థానంలో ఉన్న మలన్.. ప్రస్తుతం అజామ్ కంటే ఎనిమిది పాయింట్లతో ముందున్నాడు. మలన్ ఇప్పటి 16 టీ20ల్లో ఆడగా.. ఒక సెంచరీ, ఏడు అర్ధ సెంచరీలతో సహా 682 పరుగులు చేశాడు.
తొమ్మిదో స్థానంలో విరాట్
మరోవైపు కొవిడ్ కారణంగా ఆరు నెలలుగా అంతర్జాతీయ క్రికెట్‌ను దూరంగా ఉన్న టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్.. నాలుగో స్థానానికి పడిపోయాడు. పరుగుల రారాజు విరాట్ కోహ్లీ... తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ మూడో స్థానంలో ఉన్నాడు.
మరోవైపు ఆల్రౌండర్లలో అఫ్గానిస్థాన్‌కు చెందిన మహమ్మద్ నబీ తొలి స్థానాన్ని కైవసం చేసుకోగా.. ఆస్ట్రేలియా క్రికెటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్, జింబాబ్వే ప్లేయర్ సీన్ విలియమ్స్ రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.
బౌలింగ్ జాబితాలో..
ఇంగ్లాండ్ స్పిన్నర్ అదిల్ రషీద్.. రెండు ర్యాంక్‌లు మెరుగుపర్చుకొని ఏడో స్థానానికి చేరాడు. ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆస్టన్ అగర్ మూడో స్థానంలో ఉండగా.. టాప్ రెండు స్థానాల్లో వరుసగా రషీద్ ఖాన్, ముజీబుర్ రెహమాన్ ఉన్నారు. ఆస్టేలియా పేసర్ కేన్ రిచర్డ్సన్ తొలిసారి టాప్-10లో చోటు దక్కించుకున్నాడు.
ఆసీస్ నంబర్ వన్..
టీ20 ఫార్మాట్లో ఆసీస్ జట్టు 275 పాయింట్లతో నంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఇంగ్లాండ్(271), భారత్((266) పాయింట్లతో తర్వాత స్థానాలు దక్కించుకున్నాయి.