భారత్, న్యూజిలాండ్ మధ్య జరగనున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్‌ను సౌథాంప్టన్ వేదికగా జరగనున్నట్లు ఐసీసీ అధికారికంగా వెల్లడించింది. ఈ తుదిపోరును జూన్ 18 నుంచి 22 వరకు నిర్వహించనుంది. అయితే దీనికి రిజర్వ్‌డేగా జూన్ 23వ తేదీని ప్రకటించింది.
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ వేదికను మార్చినట్లు ఐసీసీ స్పష్టం చేసింది. సౌథాంప్టన్‌లో అప్పటి పరిస్థితిని బట్టి ప్రేక్షకులను కొంతమేర అనుమతిస్తామని వెల్లడించింది.
కరోనా సంక్షోభం తర్వాత సౌథాంప్టన్‌లోనే వెస్టిండీస్, పాకిస్థాన్ జట్లతో సిరీస్‌లను బయోబబుల్ ఏర్పాటు చేసి ఇంగ్లాండ్ బోర్డు విజయవంతంగా నిర్వహించింది. దీంతో టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్‌కూ ఇదే మైదానాన్ని వినియోగించాలని.. ఐసీసీ నిర్ణయించింది.
ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్‌కు ముందుగా న్యూజిలాండ్ అర్హత సాధించగా.. ఇటీవలే ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో గెలుపొందిన టీమ్ఇండియా తుదిపోరుకు చేరుకుంది.
ఇదీ చూడండి: టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ వేదిక మార్పు