ETV Bharat / sports

'వార్నర్​ బ్యాట్ పడితే ఆ బాక్సర్​ గుర్తొస్తాడు'

డేవిడ్​ వార్నర్​ జట్టులో ఉంటే దిగ్గజ బాక్సర్​ మేవెదర్​ ఉన్నట్లేనని ఆస్టేలియా క్రికెట్​ కోచ్​ జస్టిన్​ లాంగర్​ అన్నారు. గతంలో బాల్​ ట్యాంపరింగ్ విషయంలో వార్నర్​పై నిషేధం విధించడంపైనా స్పందించారు కోచ్​ లాంగర్​.

david warner
వార్నర్​
author img

By

Published : Jul 6, 2020, 6:59 AM IST

రింగులో ఎందరో మహామహుల్ని మట్టి కరిపించిన గొప్ప బాక్సర్​ ఫ్లాయిడ్​ మేవెదర్​. వృత్తిపరంగా 50 సార్లు రింగులో తలబడగా.. అసలు ఓటమనేది లేకుడా రికార్డు సృష్టించాడు. చివరగా 2018లో బాక్సింగ్​ పోటీల్లో పాల్గొన్నాడు మేవెదర్​. అయితే క్రికెట్​లో అంతటి భయంకరమైన బాక్సర్​కు సమానమైన ఆటగాడు ఎవరో తెలుసా?

ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్​ వార్నర్​ను ప్రముఖ బాక్సింగ్​ ఛాంపియన్..​ ఫ్లాయిడ్​ మేవెదర్​తో పోల్చాడు ఆ దేశ కోచ్​ జస్టిన్​ లాంగర్​. ఈ క్రమంలోనే 2018 బాల్​ ట్యాంపరింగ్​ కారణంగా వార్నర్​ కెప్టెన్సీపై జీవితకాలం నిషేధం గురించి కూడా స్పందించాడు. 2018 మార్చిలో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్​లో బాల్​ ట్యాంపరింగ్​కు పాల్పడినందుకు అప్పటి కెప్టెన్​ స్టీవ్​స్మిత్​, వార్నర్​లకు ఏడాది పాటు నిషేధం విదించింది.

david warner
వార్నర్​

"చూడండి, నేను అతనికి మద్దుతుగా ఉంటా. జట్టులో డేవిడ్​ వార్నర్ ఉంటడమంటే బాక్సర్​ ఫ్లాయిడ్​ మేవెదర్​ను కలిగి ఉన్నట్లే. అధికారికంగా అతను ఆస్ట్రేలియాకు తిరిగి కెప్టెన్​ కాకుండా నిషేధించారు. వార్నర్​ మళ్లీ సారథిగా వస్తాడని మేము అనుకోవడం లేదు. కానీ, జట్టులో అతను ఉంటే చాలు. వార్నర్​ అద్భుతమైన ఆడగాడు."

-జస్టిన్​ లాంగర్​, ఆస్ట్రేలియా క్రికెట్​ కోచ్​

ట్యాంపరింగ్ విషయంలో వార్నర్​పై చర్యలు తీసుకున్న రెండు నెలల తర్వాత ఆస్ట్రేలియా జట్టు కోచ్​గా బాధ్యతలు స్వీకరించారు లాంగర్.. నిషేధం నుంచి వార్నర్​ తిరిగి వచ్చినప్పటినుంచి జట్టుకు అద్భుతమైన ప్రదర్శన ఇస్తున్నట్లు లాంగర్​ తెలిపారు.

david warner
వార్నర్​

ఇదీ చూడండి:గంగూలీ ఆడిన గొప్ప మ్యాచ్​ల్లో అదొకటి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.