ETV Bharat / sports

టీమ్​ఇండియాకు సలహా.. కోహ్లీకి స్మిత్ మద్దతు

అడిలైడ్​ టెస్టులో ఓడిన టీమ్​ఇండియాకు ఆసీస్ బ్యాట్స్​మన్​ స్టీవ్​స్మిత్ సలహా ఇచ్చాడు. కోహ్లీ పితృత్వ సెలవులు తీసుకోవడం సరైన నిర్ణయమేనని అభిప్రాయపడ్డాడు.

Let it go and move on: Smith's advice to deflated India after Adelaide debacle
ఓటమి తర్వాత టీమ్​ఇండియాకు స్మిత్​ సలహా!
author img

By

Published : Dec 22, 2020, 1:02 PM IST

బోర్డర్​-గావస్కర్​ ట్రోఫీని ఓటమితో మొదలుపెట్టిన భారత జట్టుకు ఆస్ట్రేలియా బ్యాట్స్​మన్​ స్టీవ్​స్మిత్​ సలహా ఇచ్చాడు. 'గతాన్ని వదిలేసి ముందుకు సాగండి' అంటూ కోహ్లీసేనను ఉద్దేశించి మాట్లాడాడు. తొలి టెస్టులో ఓడిన టీమ్​ఇండియా, రెండో టెస్టులో ఎలా ప్రతీకారం తీర్చుకుంటుందే అనే విషయం తాను అస్సలు ఆలోచించట్లేదని అన్నాడు.

"ఈ పరిస్థితిలో ముందుకు సాగడం ముఖ్యం. మీలో(భారత జట్టు) ప్రతి ఒక్కరూ బాగా రాణించారు. టీమ్​ఇండియా గురించి ఎక్కువగా ఆలోచించడం లేదు. నాకు తెలిసి ఆ జట్టులో ఇద్దరూ నైపుణ్యం కలిగిన బౌలర్లు ఉన్నారు. ఇప్పటికే ఇషాంత్​ సిరీస్​కు దూరమయ్యాడు. అనుభవం కలిగిన ఆటగాళ్లతో పోలిస్తే భారత జట్టుకు ఇది పెద్ద లోటు. అదే విధంగా కోహ్లీ, షమి ఆడకపోవడం వల్ల ఆ జట్టుపై ప్రభావం పడే అవకాశం ఉంది"

- స్టీవ్​స్మిత్​, ఆస్ట్రేలియా బ్యాట్స్​మన్​

ఆస్ట్రేలియా బౌలింగ్​ త్రయం మిచెల్​ స్టార్క్​, పాట్ కమిన్స్​, జోష్​ హేజిల్​వుడ్​.. ఇటీవల కాలంలో అద్భుతంగా బౌలింగ్​ చేస్తున్నారు. వీళ్ల బౌలింగ్​లోనే టీమ్​ఇండియా 36 పరుగులకే ఆలౌటైంది. ఫలితంగా 8 వికెట్ల తేడాతో ఆసీస్ తొలి టెస్టులో ఘనవిజయాన్ని అందుకుంది. ఈ సిరీస్​లోని రెండో టెస్టు (బాక్సింగ్​ డే టెస్టు) మెల్​బోర్న్​ వేదికగా డిసెంబరు 26 నుంచి ప్రారంభం కానుంది.

కోహ్లీది సరైన నిర్ణయమే!

టీమ్​ఇండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లీ పితృత్వ సెలవులపై స్వదేశానికి వెళ్లడం సరైన నిర్ణయమని స్మిత్ అన్నాడు. జీవితంలో తొలిసారి వచ్చే అనుభూతిని కోల్పోకూడదని అభిప్రాయపడ్డాడు. "టెస్టు సిరీస్​లో మిగిలిన మ్యాచ్​ల్లో కోహ్లీ అందుబాటులో లేకపోవడం కచ్చితంగా టీమ్​ఇండియాకు పెద్ద నష్టమే! మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్​లో అతడు క్లాస్​గా బ్యాటింగ్​ చేశాడు. తొలి టెస్టు ముగిశాక కోహ్లీ వెళ్తున్నప్పుడు..'ప్రయాణంలో జాగ్రత్త. ప్రసవంలో అంతా మంచే జరుగుతుందని ఆశిస్తున్నా. నీ భార్యకు శుభాకాంక్షలు తెలియజేయి' అని చెప్పాను. అయితే ఈ పరిస్థితిలో అతడు స్వదేశానికి వెళ్లడమే సరైన నిర్ణయం. ఒకవేళ ఇక్కడే ఉంటే అతడిపై చాలా ఒత్తిడి పెరుగుతుంది. పితృత్వ సెలవులు తీసుకునే అర్హత అతడికి ఉంది. తన భార్య ప్రసవించే క్రమంలో అతడు దగ్గర ఉండడం ఎంతో ముఖ్యం" అని స్మిత్​ చెప్పాడు.

ఇదీ చూడండి: సర్ బ్రాడ్​మన్​ టెస్టు క్యాప్​కు భారీ ధర

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.