ETV Bharat / sports

స్పిన్ దిగ్గజం రాజిందర్ గోయల్ మృతి - స్పిన్ దిగ్గజం రాజిందర్ గోయల్ వార్తలు

భారత తరఫున ఫస్ట్​క్లాస్ మ్యాచ్​ల్లో అత్యధిక వికెట్లు తీసి గుర్తింపు తెచ్చుకున్న రాజిందర్ గోయల్.. అనారోగ్య సమస్యలతో తుదిశ్వాస విడిచారు.

స్పిన్ దిగ్గజం రాజిందర్ గోయల్ మృతి
స్పిన్ దిగ్గజం రాజిందర్ గోయల్
author img

By

Published : Jun 22, 2020, 7:05 AM IST

ఫస్ట్‌క్లాస్‌ దిగ్గజ స్పిన్నర్‌ రాజిందర్‌ గోయల్‌ (77) ఆదివారం తుదిశ్వాస విడిచారు. వయసు సంబంధిత అనారోగ్య సమస్యలతో మరణించారు. దేశవాళీలో మ్యాచ్‌ రిఫరీగానూ పనిచేసిన ఆయనకు భార్య, ఓ కొడుకు ఉన్నారు. ఈ లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ 157 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ల్లో 750 వికెట్లు తీశారు. ఫస్ట్​క్లాస్ మ్యాచ్​ల్లో ఎక్కువ వికెట్లు(637) తీసిన ఘనత ఈయనకే సొంతం. హరియాణా, నార్త్‌ జోన్‌ తరపున ప్రాతినిథ్యం వహించారు. మంచి స్పిన్నర్‌గా పేరు తెచ్చుకున్నప్పటికీ స్పిన్‌ దిగ్గజం బిషన్‌ సింగ్‌ బేడీ తరం ఆటగాడు కావడం వల్ల భారత జట్టులో గోయల్​కు ఆడే అవకాశమే దక్కలేదు. బిషన్‌ సింగ్‌ చేతుల మీదుగా ఆయన బీసీసీఐ సీకే నాయుడు జీవితకాల సాఫల్య పురస్కారం అందుకున్నారు. భారత దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ తన పుస్తకం 'ఐడల్స్‌'లో 'నవ్వుతూనే చంపేవాడు' అని గోయల్‌ గురించి ప్రస్తావించారు.

1974-75లో వెస్టిండీస్‌తో సిరీస్‌కు ఎంపిక కావడం వల్ల గోయల్‌ కొత్త బూట్లు, కిట్‌ కొనుక్కున్నాడని... కానీ తొలి టెస్టులో 12వ ఆటగాడిగా ఆడాడని, తర్వాత టెస్టులో బిషన్‌సింగ్‌ బేడీ జట్టులోకి రావడం వల్ల ఈ స్పిన్నర్‌ భారత్‌కు ఆడే అవకాశాన్ని కోల్పోయాడని సన్నీ గుర్తు చేసుకున్నాడు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.