ETV Bharat / sports

బోర్ కొట్టొద్దంటే ఇలా చేయండి: బ్రెట్ ​లీ - బ్రెట్​ లీ వార్తలు

కరోనా కారణంగా ఈసారి ఐపీఎల్​ను యూఏఈ వేదికగా బయో బబుల్ విధానంలో నిర్వహించనున్నారు అయితే ఆటగాళ్లు రూమ్​లకే పరిమితం కావడం వల్ల వారికి బోర్ కొట్టే అవకాశం ఉంది. అందువల్ల అలా జరగకుండా ఉండటానికి ఇలా చేయండంటూ కొన్ని సలహాలు ఇచ్చాడు ఆస్ట్రేలియా మాజీ బౌలర్ బ్రెట్​ లీ.

బోర్ కొట్టొద్దంటే ఇలా చేయండి; బ్రెట్ ​లీ

author img

By

Published : Aug 10, 2020, 5:29 AM IST

కరోనా కారణంగా క్రికెట్​ మ్యాచ్​లు నిర్వహించాలంటే సురక్షిత వాతావరణం కచ్చితంగా అవసరం. అందుకే బయో సెక్యూర్ బబుల్ విధానంలో టోర్నీలు నిర్వహించడానికి మొగ్గుచూపుతున్నారు. తాజాగా ఐపీఎల్​ కూడా ఇదే విధానంలో యూఏఈ వేదికగా జరగనుంది. అందుకోసం ఆటగాళ్లందరూ ఆ బుడగ లోపలే ఉండాల్సి వస్తుంది. అందువల్ల ఆటగాళ్లకు కాస్త బోర్ కొట్టే అవకాశం ఉంది. అలా కాకుండా ఉండాలంటే ఇలా చేయండంటూ క్రికెటర్లకు కొన్ని సలహాలు ఇచ్చాడు ఆస్ట్రేలియా మాజీ బౌలర్ బ్రెట్ ​లీ.

"మొదటగా మీరు ఆరోగ్యంగా ఉండాలంటే భౌతిక దూరం పాటిస్తూ, కరోనా నిబంధనలు పాటించాలి. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఐపీఎల్ జరగాలని కోరుకుంటున్నారు. ఈ ఆటను వారు చాలా మిస్సవుతున్నారు. ఇది ఎనిమిది నుంచి తొమ్మిది వారాల టోర్నీ. రూమ్​ల్లో ఉండి ఆటగాళ్లకు బోర్ కొట్టే అవకాశం ఉంది. అందువల్ల గిటార్ నేర్చుకోండి. నేను అయితే అదే చేస్తా. ఈ పరిస్థితుల్లో బయటకెళ్లి గోల్ఫ్ ఆడలేను. అందుకే గిటార్ వాయిస్తూ.. కార్డ్స్ ఆడుకుంటా."

-బ్రెట్​ లీ, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్

ఐపీఎల్ 13వ సీజన్ సెప్టెంబర్ 19న ప్రారంభంకానుంది. నవంబర్ 10 వరకు ఈ టోర్నీ జరగబోతుంది. ఈ సీజన్​ కోసం ఆటగాళ్లతో పాటు అభిమానులూ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.