క్రికెటర్లకు వచ్చే మానసిక ఒత్తిళ్లపై వెస్టిండీస్ దిగ్గజ బ్యాట్స్‌మన్ బ్రియాన్ లారా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన కెరీర్లో చాలా సార్లు ఈ సమస్య అనుభవించినట్లు చెప్పాడు. అంతర్జాతీయ క్రికెట్ ఆడేటపుడు మానసిక సమస్యలు వస్తుంటాయని, అది వాస్తవమని అన్నాడు. ఒక్కోసారి తీవ్రమైన ఒత్తిడి కలుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశాడు.
"నా అంతర్జాతీయ కెరీర్లో 1989-1995 మధ్య నాకు మంచి పేరొచ్చింది. ప్రజలు అభినందిస్తారని ఆ సమయంలో అనుకోలేదు. అత్యధిక పరుగుల రికార్డు చేయడం వల్ల, 1995-98 మధ్య జరిగిన చాలా మ్యాచ్‌ల్లో తీవ్ర ఒత్తిడికి గురయ్యాను.
-బ్రియాన్ లారా, వెస్టిండీస్ మాజీ క్రికెటర్
ఫస్ట్‌క్లాస్ క్రికెట్ మ్యాచ్(1993), టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ లారానే. అంతర్జాతీయ టెస్టు క్రికెట్లో రెండుసార్లు(1994, 2004) అత్యధిక పరుగుల చేసిన ఘనత లారాదే కావడం విశేషం.
ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మాక్స్‌వెల్‌తో పాటు మరికొందరు క్రికెటర్లు.. మానసిక ఆరోగ్య సమస్యలతో ఇటీవలే ఆటకు కొద్దిరోజులు విరామం ప్రకటించారు. ఈ విషయంపై మాట్లాడిన లారా.. ఈ మధ్య ఆటగాళ్లు ఎక్కువగా ఒత్తిడికి గురవుతున్నారని, వీరంతా తమ దేశం కోసం ప్రేమతో ఆడుతున్నారని అన్నాడు.
భారత్ పర్యటనలో ప్రస్తుతమున్న వెస్టిండీస్ జట్టు.. కీరన్ పొలార్డ్‌కు కెప్టెన్సీ అప్పగించడం మంచి నిర్ణయమని లారా అభిప్రాయపడ్డాడు.
ఇదీ చూడండి: 'దిశ'కు న్యాయం- సజ్జనార్ స్వస్థలంలో సంబరం