ETV Bharat / sports

కోహ్లీని అలా ఔట్ చేశా: జేమిసన్ - భారత్ న్యూజిలాండ్

టీమిండియా సారథి విరాట్ కోహ్లీ న్యూజిలాండ్​తో జరుగుతోన్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్​లో కేవలం 2 పరుగులకే పరిమితమయ్యాడు. ఇతడిని కివీస్ బౌలర్ జేమిసన్ పెవిలియన్ చేర్చాడు. అయితే అరంగేట్రంలోనే కోహ్లీ వికెట్ తీయడంపై స్పందించాడు జేమిసన్.

కోహ్లీ
కోహ్లీ
author img

By

Published : Feb 22, 2020, 9:08 AM IST

Updated : Mar 2, 2020, 3:50 AM IST

టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ, నయావాల్‌ చెతేశ్వర్‌ పుజారా క్రీజులో నిలిస్తే మైదానంలో పరుగుల వరద పారడం ఖాయం. అలాంటిది అరంగేట్ర టెస్టులోనే వీరిద్దరినీ పెవిలియన్‌ పంపించి సంచలనం సృష్టించాడు కివీస్‌ యువపేసర్‌ జేమిసన్‌. మిడిలార్డర్‌లో ప్రధానమైన హనుమ విహారినీ ఔట్‌ చేశాడు. తొలిటెస్టు తొలిరోజు మూడు వికెట్లు తీసి భారత్‌ను 122/5కు పరిమితం చేశాడు. నెల రోజులుగా ఏం జరుగుతుందో నమ్మశక్యం కాకుండా ఉందని జేమిసన్‌ అంటున్నాడు. కోహ్లీని ఔట్‌ చేసేందుకు అతడి బలహీనతలు వెతకలేదని తెలిపాడు.

"నిజంగా నమ్మశక్యం కావడం లేదు. రెండు వారాలుగా ఏం జరుగుతుందో అర్థమవ్వడం లేదు. ఈ మ్యాచ్​లో మేమిప్పుడు మంచి స్థితిలో ఉన్నాం. విరాట్‌ కోహ్లీ అద్భుత ఆటగాడు. టీమిండియా బ్యాటింగ్‌ లైనప్‌లో అతడు కీలకం. విరాట్‌ త్వరగా ఔటవ్వడం మాకు కీలకం. ఇద్దరు ఆటగాళ్లను తొలి సెషన్‌లోనే పెవిలియన్‌కు పంపించడం నాకు ప్రత్యేకం. కోహ్లీని ఔట్‌ చేసేందుకు అతడి బలహీనతల గురించి వెతకడం తెలివైన పనికాదు. ఎందుకంటే అతడు అన్ని దేశాల్లోనూ పరుగులు చేస్తున్నాడు. స్టంప్‌కు విసిరితే అతడు బాగా ఆడతాడు. అందుకే పిచ్‌ సహకారంతో స్టంప్‌లైన్‌కు కొద్దిగా పక్కకు విసిరాను. అదృష్టవశాత్తూ బంతి అతడి బ్యాట్‌ అంచుకు తగిలి దొరికిపోయాడు."

-జేమిసన్, న్యూజిలాండ్ బౌలర్

నిలకడకు మారుపేరైన కోహ్లీ గత 19 ఇన్నింగ్స్‌ల్లో శతకాలు బాదలేదు. కివీస్‌ బౌలర్లు అతడికి కట్టుదిట్టంగా బంతులు వేయడంలో సఫలమవుతున్నారు. అతడి కెరీర్‌లో మళ్లీ 2014 నాటి పరిస్థితులు కనిపిస్తున్నాయి.

Last Updated : Mar 2, 2020, 3:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.