మెరీల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎమ్‌సీసీ)కు తొలి బ్రిటిషేతర అధ్యక్షుడిగా సంగక్కర ఎంపికయ్యాడు. అక్టోబర్ 1 నుంచి బాధ్యతలు చేపట్టి... ఏడాది పాటు ఈ పదవిలో కొనసాగనున్నాడు. సంగక్కర ఈ అరుదైన అవకాశం అందుకున్నట్లు ప్రస్తుత ఎంసీసీ అధ్యక్షుడు ఆంథోని రెఫార్డ్ వెల్లడించారు.
'ఎంసీసీ అంతర్జాతీయంగా తన పరపతిని పెంచుకోవాలని చూస్తోంది. ఈ విషయంపై కుమార ముందుకొచ్చినందుకు సంతోషంగా ఉంది. అతడు మైదానం లోపలా బయట మంచి సత్సంబంధాలు కలిగి ఉన్నాడు. అది క్లబ్‌కు పనికొస్తుంది. అధ్యక్షుడి హోదాలోనే ప్రపంచకప్, ఏడాది పాటు సిరీస్‌లకు తన బాధ్యతలు నిర్వర్తించనున్నాడు'
-- ఆంథోనీ రెఫార్డ్, ప్రస్తుత ఎంసీసీ అధ్యక్షుడు
క్రికెట్ నిబంధనల సంరక్షణ...
1787లో ప్రతిష్ఠాత్మక లార్డ్స్‌లో ఎంసీసీ స్థాపించారు. 1814 వరకు లార్డ్స్ పరిధిలోనే ఉండేది. క్రికెట్ నిబంధనల రూపకల్పనలో కీలక పాత్ర పోషించేది ఈ క్లబ్ అందుకే దీన్ని 'గార్డియన్ ఆఫ్ ద లా ఆఫ్ ద గేమ్' అని పిలుస్తుంటారు.
-
Introducing MCC's next President...
— Lord's Cricket Ground 🏏 (@HomeOfCricket) May 1, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
👏 Congratulations, @KumarSanga2.
">Introducing MCC's next President...
— Lord's Cricket Ground 🏏 (@HomeOfCricket) May 1, 2019
👏 Congratulations, @KumarSanga2.Introducing MCC's next President...
— Lord's Cricket Ground 🏏 (@HomeOfCricket) May 1, 2019
👏 Congratulations, @KumarSanga2.
'ఎంసీసీ అధ్యక్షుడిగా నేను ఎంపికవడం గొప్ప గౌరవం. ఇలాంటి బాధ్యత కోసమే ఎదురుచూస్తున్నా. నా దృష్టిలో ఎంసీసీ ప్రపంచ క్రికెట్ క్లబ్‌లలో అత్యున్నతమైనది. ప్రపంచవ్యాప్తంగా దీనికి అంత పేరుంది. 2020 సంవత్సరం క్రికెట్లో మరో నవశకంగా మిగిలిపోతుంది. ముఖ్యంగా లార్డ్స్‌లో ఉండి నా కర్తవ్యాన్ని నిర్వహించే అవకాశం రావడం సంతోషకరమైన విషయం'.
-- కుమార సంగక్కర, శ్రీలంక మాజీ ఆటగాడు
నవశకానికి నాంది..
సంగక్కర బ్యాట్స్‌మెన్‌గా, వికెట్‌కీపర్‌గా మంచి పేరు తెచ్చుకున్నాడు. 134 టెస్టులాడి 12 వేల 4 వందల పరుగులు చేశాడు. 2014లో తన అద్భుతమైన ఇన్నింగ్స్‌లకు లార్డ్స్‌లో 2 సార్లు గౌరవ సత్కారాన్ని అందుకున్నాడు.
సంగక్కర అధ్యక్షుడిగా ఉండనున్న సమయంలోనే వెస్టిండీస్, పాకిస్థాన్‌తో ఇంగ్లండ్ టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. 100 బంతుల నూతన క్రికెట్ ఫార్మాట్‌కు... ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ఇతడి హాయాంలోనే నాంది పలకనుంది.