ETV Bharat / sports

ధోనీపై ఎప్పుడూ ఆధారపడలేదు: కుల్దీప్ - ధోనిపై ఎప్పుడు ఆధారపడలేదు

మహేంద్ర సింగ్ ధోనీ మీద తాను ఆధారపడ్డానంటూ వస్తోన్న వార్తలను ఖండించాడు టీమ్​ఇండియా స్పిన్నర్​ కుల్దీప్​ యాదవ్​. తానెప్పుడూ మహీపై ఆధారపడలేదని స్పష్టం చేశాడు. ధోనీ మార్గనిర్దేశం మాత్రమే చేశాడని తెలిపాడు.

kuldeep yadav
కుల్దీప్​ యాదవ్​
author img

By

Published : Jun 17, 2020, 7:39 AM IST

Updated : Jun 17, 2020, 8:42 AM IST

టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్ ధోనీపై తాను ఆధారపడి లేనని స్పిన్నర్‌ కుల్దీప్ యాదవ్‌ తెలిపాడు. మహీ తనకు ఎప్పుడూ మార్గనిర్దేశం మాత్రమే చేశాడని స్పష్టం చేశాడు.

"నాకెప్పుడూ ధోనీ మార్గనిర్దేశం చేసేవాడు. బౌలర్‌ దృష్టిలో అత్యుత్తమ న్యాయ నిర్ణేత వికెట్‌ కీపరే. ధోనీకి ఎంతో అనుభవం ఉంది. బ్యాట్స్‌మెన్‌ ఎలా ఆడతారో అతడికి బాగా తెలుసు. అయితే ప్రపంచకప్‌ తర్వాత ధోనీ ఆడనంత మాత్రాన నన్ను నేను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. మహీ మీద ఆధారపడ్డానని చెప్పాల్సిన పనిలేదు. నా నైపుణ్యాన్ని మెరుగు పరుచుకునేందుకు మరింత బాగా పనిచేయగలను."

- కుల్దీప్, టీమ్​ఇండియా స్పిన్నర్.

2019 ప్రపంచకప్‌ తర్వాత ధోనీ ఆటకు దూరమైనప్పటి నుంచి కూల్దీప్‌ ప్రదర్శన తీసికట్టుగా తయారైంది. ఈ నేపథ్యంలో ధోనీ గైర్హాజరు తన బౌలింగ్‌పై ప్రభావం చూపిందా? అని జోరుగా పుకార్లు వచ్చాయి. దీంతో ఈ విషయంపై స్పష్టతనిచ్చాడు కుల్దీప్​.

ఇది చూడండి : భారత క్రికెటర్లపై పాక్​ దిగ్గజం ప్రశంసలు

Last Updated : Jun 17, 2020, 8:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.