ETV Bharat / sports

'ఇంగ్లాండ్ పర్యటన కోసం ముందే ప్లాన్ రెడీ చేశాం'

తన బౌలింగ్​ను మెరుగుర్చుకోవడానికి అశ్విన్ సలహాలు ఇచ్చాడని తెలిపాడు టీమ్ఇండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్. ఆస్ట్రేలియా పర్యటనలోనే ఇంగ్లాండ్ సిరీస్​ గురించి చర్చించుకున్నామని వెల్లడించాడు.

Kuldeep
కుల్దీప్
author img

By

Published : Feb 3, 2021, 2:30 PM IST

టీమ్ఇండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కొంతకాలంగా తుదిజట్టులో చోటు సంపాదించలేకపోతున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికైనా ఒక్క అవకాశం కూడా దక్కించుకోలేకపోయాడు. ప్రస్తుతం స్వదేశంలో ఇంగ్లాండ్​తో జరగబోయే టెస్టు సిరీస్ కోసం సిద్ధమవుతోన్న ఇతడు ఈ సిరీస్​లో అయినా చోటు లభించాలన్న కోరికతో ఉన్నాడు. తాజాగా తన బౌలింగ్​ను మరింతగా సానబెట్టడం కోసం టీమ్ఇండియా స్పిన్నర్ రవి అశ్విన్ సలహాలు ఇచ్చాడని తెలిపాడు.

"అశ్విన్ కొన్ని సలహాలు ఇచ్చాడు. నా రిథమ్​లో ఇంకాస్త వేగం పెంచుకోమని, బంతిని స్ట్రెయిట్​గా వేయమని చెప్పాడు. బౌలింగ్​లో కొన్ని మార్పులు చేయమని సూచించాడు. బౌలింగ్​ పరంగానే కాకుండా మ్యాచ్​ ప్రణాళికల్లో అశ్విన్​కు మంచి పట్టుంది. ఆస్ట్రేలియా పర్యటన సమయంలో మేము ఇంగ్లాండ్ సిరీస్​ గురించి చాలా చర్చించాం. రూట్ బ్యాటింగ్ చేస్తుంటే ఎక్కడ బంతులను వేయాలి, ఏ ఫీల్డర్ దగ్గరగా ఉండాలి? లాంటి అంశాల గురించి మాట్లాడుకున్నాం."

-కుల్దీప్, టీమ్ఇండియా స్పిన్నర్

భారత్-ఇంగ్లాండ్​ల మధ్య తొలి టెస్టు శుక్రవారం (ఫిబ్రవరి 5) ప్రారంభంకానుంది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఇరుజట్లు ప్రాక్టీస్​ను ముమ్మరం చేశాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.