ఆల్‌రౌండర్ అనే పదానికి సరైన అర్థం చెబుతూ కర్ణాటక ప్రీమియర్ లీగ్‌లో కృష్ణప్ప గౌతమ్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. ఫలితంగా బల్లారీ టస్కర్స్.. షిమోగా లయన్స్‌పై ఘనవిజయం సాధించింది.
వర్షం కారణంగా మ్యాచ్‌ను 17 ఓవర్లకు కుదించారు. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన బల్లారీ జట్టు నిర్ణీత ఓవర్లలో 203 పరుగులు చేసింది. రెండో వికెట్‌గా వచ్చిన కృష్ణప్ప గౌతమ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 56 బంతుల్లో 13 సిక్సులు, 7 ఫోర్లతో 134 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. కేపీఎల్‌లో ఓ ఆటగాడికి ఇదే వ్యక్తిగత అత్యధిక స్కోర్ కావడం విశేషం.
బౌలింగ్‌లోనూ విజృంభించాడు గౌతమ్. నాలుగు ఓవర్లు వేసి 15 పరుగులకు 8 వికెట్లు తీసి ఔరా అనిపించాడు. ఈ ఆటగాడి దూకుడు ఫలితంగా బల్లారీ జట్టు 70 పరుగుల తేడాతో షిమోగాను మట్టికరిపించింది.
-
🚨 Record Alert 🚨
— Namma KPL (@KPLKSCA) August 23, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
FOUR records were broken after that effort from @gowthamyadav88 tonight.#JustGowthamThings 💁🏻♂️ #BTvSL #KPLNoduGuru pic.twitter.com/mgpkuhJkLr
">🚨 Record Alert 🚨
— Namma KPL (@KPLKSCA) August 23, 2019
FOUR records were broken after that effort from @gowthamyadav88 tonight.#JustGowthamThings 💁🏻♂️ #BTvSL #KPLNoduGuru pic.twitter.com/mgpkuhJkLr🚨 Record Alert 🚨
— Namma KPL (@KPLKSCA) August 23, 2019
FOUR records were broken after that effort from @gowthamyadav88 tonight.#JustGowthamThings 💁🏻♂️ #BTvSL #KPLNoduGuru pic.twitter.com/mgpkuhJkLr
ఒక్క మ్యాచ్‌తో గౌతమ్ రికార్డులు
- కర్ణాటక ప్రీమియర్ లీగ్‌లో అత్యధిక స్కోర్ (134) చేసిన ఆటగాడిగా ఘనత.
- లీగ్‌లో ఒక్క ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సులు (13) బాది రికార్డు
- ఫోర్లు, సిక్సులు ద్వారా గౌతమ్ 106 పరుగులు సాధించాడు. ఇదీ రికార్డే.
- 39 బంతుల్లో సెంచరీ సాధించి.. అతి తక్కువ బంతుల్లో శతకం చేసిన ఆటగాడిగా ఘనత.
ఇవీ చూడండి.. అశ్విన్ రికార్డును తిరగరాసిన పేసర్ బుమ్రా