ETV Bharat / sports

సచిన్​ X కోహ్లీ : పన్నెండేళ్ల కెరీర్​లో ఎవరిది పైచేయి? - sachin kohli records

టీమ్​ఇండియా సారథి​ కోహ్లీ 12 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్​ పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలోనే దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందుల్కర్​తో పాటు విరాట్.. పన్నెండేళ్ల వన్డే కెరీర్​లో వారు సాధించిన రికార్డులపై ఓ లుక్కేద్దాం. ​

Kohli vs Tendulkar
సచిన్​ కోహ్లీ
author img

By

Published : Aug 19, 2020, 6:44 PM IST

సచిన్​ తెందుల్కర్​..క్రికెట్​ చరిత్రలో ఓ దిగ్గజం. అద్భుత బ్యాటింగ్​తో ఎన్నో రికార్డులు సృష్టించాడు. ఎవరికీ సాధ్యం కాని ఎన్నో ఘనతలు సాధించాడు. ఇప్పుడు వాటిని అధిగమించి దూసుకెళ్తున్నాడు టీమ్​ఇండియా ప్రస్తుత సారథి​ కోహ్లీ. ఆగస్టు 18తో కోహ్లీ 12 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్​ పూర్తయింది. ఈ ప్రయాణంలో ఎన్నో ఘనతలు సాధించి.. అగ్రశ్రేణి బ్యాట్స్​మన్​గా ఎదిగాడు. పరుగుల వరద పారిస్తూ వచ్చాడు. ఈ క్రమంలోనే పన్నెండేళ్ల కెరీర్​లో సచిన్​​, కోహ్లీ​ రికార్డులు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం.

వన్డేల్లో కోహ్లీ-సచిన్

సచిన్​ 86.49 స్ట్రైక్​రేట్​తో 10,803 పరుగులు చేశాడు. ఇందులో 31 శతకాలు, 53 అర్థ శతకాలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 186 నాటౌట్. కోహ్లీ 93.25 స్ట్రైక్​రైట్​తో 11,867 పరుగులు చేశాడు. 43 సెంచరీలు, 58 అర్థ సెంచరీలు నమోదు చేశాడు. అత్యధిక స్కోరు 183. ప్రస్తుతం ఐసీసీ బ్యాట్స్​మెన్ ర్యాంకింగ్స్​లో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు విరాట్.

టెస్టుల్లో 86 మ్యాచులాడిన కోహ్లీ.. 53.26 స్ట్రైక్​రేట్​తో 7,240 పరుగులు చేశాడు. ఇందులో 27 శతకాలు ఉండటం విశేషం.

Kohli vs Tendulkar
సచిన్​ కోహ్లీ

సచిన్​ మొత్తం కెరీర్​

మొత్తంగా కెరీర్​లో 463 వన్డేలు ఆడిన సచిన్.. 18,426 పరుగులు చేశాడు. 49 శతకాలు బాదాడు. 200 టెస్టుల్లో చేసిన 15,921 పరుగుల్లో 51 సెంచరీలు ఉన్నాయి.

వంద సెంచరీలు

100 సెంచరీలు చేసిన ఏకైక్ క్రికెటర్ సచిన్ తెందుల్కర్. కోహ్లీ ఇప్పటివరకు 70 శతకాలు బాదాడు. ఇదే ఫామ్​ కొనసాగిస్తే త్వరలోనే మాస్టర్​​​ రికార్డును బ్రేక్​ చేయగలడని క్రీడావిశ్లేషకుల భావిస్తున్నారు.

ఇది చూడండి ప్రపంచకప్​ తర్వాత ఆస్ట్రేలియా కెప్టెన్​ రిటైర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.