నరాలు తెగే ఉత్కంఠతో సాగిన మూడో వన్డేలో ఇంగ్లాండ్‌పై భారత్ అద్భుత విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో శార్దుల్ ఠాకుర్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇవ్వకపోవడం, భువనేశ్వర్‌కు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ రాకపోవడంపై కెప్టెన్ కోహ్లీ విస్మయం వ్యక్తం చేశాడు.
"శార్దుల్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, భువీకి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ఇవ్వకపోవడంపై నన్ను ఆశ్చర్యపరిచింది. భిన్న పరిస్థితుల్లో వారు అద్భుతంగా బౌలింగ్ చేసి జట్టు విజయంలో కారణమయ్యారు" అని మ్యాచ్ అనంతరం కోహ్లీ చెప్పాడు.
![Kohli surprised at Shardul not getting man of the match](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11198104_kohli1.jpg)
"ప్రపంచంలోనే అత్యుత్తమ జట్టుపై సిరీస్ గెలవడం, నిజంగా మాకు(టీమ్ఇండియాకు) మధురమైన అనుభూతి. ఇది నిజంగా చాలా గొప్ప సీజన్. ఇప్పుడు ఐపీఎల్ కోసం ఎదురుచూస్తున్నాం" అని విరాట్ అన్నాడు.
ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. 48.2 ఓవర్లలో 329 పరుగులకు ఆలౌటైంది. ఛేదనలో ఇంగ్లాండ్ 50 ఓవర్లలో 322/9 మాత్రమే చేయగలిగింది. సామ్ కరన్(95 నాటౌట్) అద్భుత పోరాటం చేసినప్పటికీ తమ జట్టును గెలిపించలేకపోయాడు.
ఇవీ చదవండి: