టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. టెస్టుల్లో భారత్ తరఫున అత్యధిక మ్యాచ్‌లు సారథ్యం వహించిన రెండో సారథిగా ఘనత సాధించాడు. 50 టెస్టుల్లో కెప్టెన్‌గా వ్యవహరించి... గంగూలీ (49) ని వెనక్కినెట్టాడు.
పుణె వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న రెండో టెస్టుతో ఈ ఘనత దక్కించుకున్నాడు విరాట్. ఎక్కువ మ్యాచ్‌ల్లో భారత్‌కు సారథ్యం వహించిన కెప్టెన్‌గా మహేంద్ర సింగ్ ధోని (60) అగ్రస్థానంలో ఉన్నాడు. అజారుద్దీన్, కపిల్‌దేవ్ చెరో 47 టెస్టులకు సారథ్యం వహించి 4, 5 స్థానాల్లో ఉన్నారు.
ఇప్పటికే ఎక్కువ టెస్టులు (29) గెలిపించిన భారత సారథిగా కోహ్లీ పేరిట రికార్డు ఉంది. విరాట్ కెప్టెన్‌గా వ్యవహరించిన 49 టెస్టుల్లో 10 ఓడిపోగా.. 10 డ్రా అయ్యాయి. భారత్ తరపున మొత్తం 81 టెస్టులు ఆడి ఆకట్టుకున్నాడు.
ఇదీ చదవండి: టాస్ గెలిచిన భారత్.. దక్షిణాఫ్రికా బౌలింగ్