ETV Bharat / sports

బౌలర్లను లెక్కేసి కొడుతున్న కోహ్లీ..? - virat kohli news

క్రికెట్​ మైదానంలో విరాట్​ కోహ్లీ దూకుడు ప్రదర్శన గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. అయితే ఆ సమయంలో బౌలర్లను ఏ విధంగా విశ్లేషిస్తాడో వెల్లడించాడు ఈ పరుగుల వీరుడు.

virat kohli news
కోహ్లీ
author img

By

Published : Jul 29, 2020, 7:04 AM IST

బౌలర్ల మీద కోహ్లీ ఆధిపత్యం చలాయించడం మామూలే కానీ.. అతడిపై బౌలర్లు ఎప్పుడో కానీ పైచేయి సాధించరు. మరి అంతలా బౌలర్లను అతనెలా దెబ్బ కొట్టగలుగుతున్నాడు?. వాళ్లను ఎలా చదవగలుగుతున్నాడు?. ఒక బంతిని ఎదుర్కొనే ముందు ఎలా సన్నద్ధమవుతాడు అన్నది ఆసక్తికరం. ఇటీవలే ఓ ఆన్​లైన్​ సెషన్​లో మాట్లాడిన విరాట్​.. ఈ విషయంపై స్పందించాడు.

"నేను ఎదుర్కొనే ప్రతి బౌలర్‌ గురించి పూర్తిగా విశ్లేషిస్తాను. ఓ బంతి వేసే ముందు అతడి ఒంటి తీరు ఎలా ఉందో చూస్తా. రనప్‌ ఏ విధంగా ఉంది.. మణికట్టును భిన్నంగా ఏమైనా పెట్టాడా.. బంతిని ఏ రకంగా పట్టుకున్నాడు. ఇలా అన్నీ పరిశీలిస్తా. ఎన్నోసార్లు ఇదే చేశాను. మన అంచనా సరిగ్గా ఉండి.. బంతిని బౌండరీకి తరలిస్తే వచ్చే కిక్కే వేరు. మనం భయాల్లో మునిగిపోయి ఉంటే ఇలాంటివి పరిశీలించలేం. అన్నింటికీ సిద్ధపడితే భయం పోతుంది. అప్పుడే ఈ బంతిని ఎదుర్కోవడానికి, పైచేయి సాధించడానికి అత్యుత్తమంగా ఏం చేయగలం అని ఆలోచిస్తాం". అని కోహ్లీ చెప్పాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.