ETV Bharat / sports

వన్డే ర్యాంకింగ్స్: టాప్​లోనే కోహ్లీ-రోహిత్ శర్మ

author img

By

Published : Nov 4, 2020, 4:15 PM IST

Updated : Nov 4, 2020, 4:59 PM IST

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్​లో భారత స్టార్ క్రికెటర్లు కోహ్లీ, రోహిత్.. ఆధిపత్యం చూపిస్తున్నారు. తొలి రెండు స్థానాల్లోనే కొనసాగుతున్నారు.

Kohli, Rohit continue to dominate ICC ODI rankings for batsmen
వన్డే ర్యాంకింగ్స్: టాప్​లోనే కోహ్లీ-రోహిత్ శర్మ

అంతర్జాతీయ క్రికెట్ మండలి తాజా వన్డే ర్యాంకింగ్స్​ను బుధవారం విడుదల చేసింది. టీమ్​ఇండియా స్టార్ బ్యాట్స్​మెన్ కోహ్లీ(871), రోహిత్ శర్మ(855) తొలి రెండు స్థానాల్లోనే కొనసాగుతున్నారు. జింబాబ్వే పర్యటనలో ఆకట్టుకున్న పాక్ కెప్టెన్ బాబార్ ఆజమ్.. 8 పాయింట్లు సాధించినప్పటికీ మూడో స్థానంలోనే ఉన్నాడు.

rohit kohli
రోహిత్ శర్మ - కోహ్లీ

ఇదే సిరీస్​లో మెప్పించిన పాక్ ఆల్​రౌండర్ ఇమాద్ వసీమ్.. మూడు స్థానాలు ఎగబాకి 49వ ర్యాంక్​కు వచ్చాడు. జింబాబ్వే బ్యాట్స్​మెన్​లో బ్రెండన్ టేలర్, సీన్ విలియమ్స్.. వరుసగా 42, 46వ స్థానాల్లోకి వచ్చారు.

బౌలింగ్​ విభాగంలో న్యూజిలాండ్ ఆటగాడు బౌల్ట్(722), బుమ్రా(719) తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. జింబాబ్వే సిరీస్​లో అదరగొట్టిన పాక్ బౌలర్ షహీన్ అఫ్రిది.. కెరీర్​లోనే అత్యుత్తమంగా 16వ స్థానానికి చేరుకున్నాడు.

ఇవీ చదవండి:

Last Updated : Nov 4, 2020, 4:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.