ETV Bharat / sports

'హార్దిక్​ అందుకే బౌలింగ్ చేయలేదు' - విరాట్ కోహ్లీ

భారత్​తో జరిగిన రెండో వన్డేలో ఇంగ్లాండ్ ఘనవిజయం సాధించింది. ఇంగ్లీష్ జట్టు ముందు భారీ లక్ష్యాన్ని ఉంచినా.. టీమ్ఇండియా బౌలర్లు విఫలమయ్యారు. మ్యాచ్ అనంతరం ఓటమిపై స్పందించిన సారథి కోహ్లీ.. హార్దిక్​కు బౌలింగ్ ఇవ్వకపోవడాన్ని సమర్థించుకున్నాడు.

Hardik Pandya
హార్దిక్
author img

By

Published : Mar 27, 2021, 10:58 AM IST

Updated : Mar 27, 2021, 11:39 AM IST

ఇంగ్లాండ్​తో జరిగిన రెండో వన్డేలో ఘోర ఓటమి చవిచూసింది టీమ్ఇండియా. మొదట బ్యాటింగ్ చేసి 336 పరుగుల భారీ స్కోర్ సాధించినా.. ఆ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయిన భారత్​కు పరాభవం తప్పలేదు. ఇంగ్లాండ్ బ్యాట్స్​మెన్ బాదుడు ముందు టీమ్ఇండియా బౌలర్లు తేలిపోయారు. అయితే ఈ మ్యాచ్​తో పాటు మొదటి వన్డేలోనూ హార్దిక్ పాండ్యాకు బౌలింగ్ చేసే అవకాశం ఇవ్వలేదు. దీనిపై స్పందించిన కోహ్లీ.. భవిష్యత్ టోర్నీలను దృష్టిలో ఉంచుకుని హార్దిక్​పై ఎక్కువ భారం పడకూడదనే అలా చేశామని తెలిపాడు.

"మంచి స్కోర్ సాధించామనుకున్నాం. రెండు అత్యుత్తమ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్నపుడు ఏదో ఒక జట్టు ఉత్తమ ప్రదర్శన చేయడం ఖాయం. గత మ్యాచ్​లో మేము గొప్పగా పుంజుకున్నాం. ఈసారి ఇంగ్లాండ్ మాకు అలాంటి అవకాశం ఇవ్వలేదు. పని భారం తగ్గించడం కోసమే వన్డేల్లో హార్దిక్​కు బౌలింగ్ ఇవ్వట్లేదు. టీ20ల్లో అతడిని ఉపయోగించుకున్నాం. త్వరలోనే ఇంగ్లాండ్​లో టెస్టు క్రికెట్ ఆడనున్నాం. హార్దిక్ ఫిట్​గా ఉండటం మాకు అవసరం."

-కోహ్లీ, టీమ్ఇండియా సారథి

ఈ మ్యాచ్​లో మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (108) శతకంతో రాణించగా కోహ్లీ (66), పంత్(77)​లు అర్ధశతకాలతో మెరిశారు. అనంతరం బ్యాటింగ్​కు దిగిన ఇంగ్లాండ్ ప్రారంభం నుంచే భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగింది. ముఖ్యంగా బెయిర్​స్టో బౌండరీల వర్షం కురిపించాడు. ఇతడు 112 బంతుల్లో 124 పరుగులు చేయగా.. బెన్ స్టోక్స్ 52 బంతుల్లో 99 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. దీంతో మ్యాచ్​ ఇంగ్లాండ్ వశమైంది.

Last Updated : Mar 27, 2021, 11:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.