మంగళవారం వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ-20లో చాహర్ సోదరులు అద్భుతంగా ఆడారని కెప్టెన్ విరాట్ కోహ్లీ అభినందించాడు. ఇద్దరూ అత్యుత్తమంగా ఆడారని ప్రశంసించాడు. ఈ మ్యాచ్‌లో దీపక్ చాహర్ 3 ఓవర్లలో కేవలం నాలుగే పరుగులిచ్చి 3 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.
'కొత్త వాళ్లను జట్టులోకి తీసుకుందామని నిర్ణయించుకున్న తర్వాత చాహర్ సోదరులకు అవకాశం ఇచ్చాం. రాహుల్‌కు ఇదే తొలి మ్యాచ్ అయినా అత్యుత్తమంగా ఆడాడు. కొంత విరామం తర్వాత జట్టులోకి వచ్చిన దీపక్ మంచి ప్రదర్శన చేశాడు. పిచ్ బౌలింగ్‌కు అనుకూలించకపోయినా దీపక్ తీసిన 3 వికెట్లు వెస్టిండీస్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేసింది. దీపక్ తన ఆటతో ఆకట్టుకున్నాడు" -విరాట్ కోహ్లీ, భారత సారథి
వెస్టిండీస్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో గెలిచింది. దీపక్ చాహర్ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కించుకున్నాడు. ఈ విజయంతో 3-0 తేడాతో టీ-20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది భారత్.
ఇదీ సంగతి: 'భవిష్యత్తులో పంత్ ఇంకా నిబద్ధతతో ఆడతాడు'