విండీస్ టూర్లో భాగంగా వరుస మ్యాచ్‌లతో బిజీబిజీగా ఉన్న కోహ్లీ సేనకు కాస్త విరామం దొరికింది. ఇంకేముంది ఆటగాళ్లందరూ కలిసి ఆంటిగ్వాలోని జాలీ బీచ్‌లో సరదాగా గడిపారు. అక్కడ తీసుకున్న ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు విరాట్ కోహ్లీ. "బీచ్‌లో ఆటగాళ్లతో ఇదొక అద్భుతమైన రోజు" అని పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరలవుతోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ అజింక్య రహానె, రోహిత్ శర్మ, ఇషాంత్ శర్మ, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా, మయాంక్ అగర్వాల్, సహాయ సిబ్బంది బీచ్‌లో ఎంజాయ్ చేస్తూ కనిపించారు.
ఇటీవల విండీస్‌తో జరిగిన టీ20, వన్డే సిరీస్‌ను టీమిండియా క్లీన్‌స్వీప్ చేసింది. రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా రేపటి నుంచి ఆంటిగ్వాలో విండీస్‌తో తొలి టెస్టును ఆడనుంది. ఈ సిరీస్‌తోనే ఇరుజట్లకు టెస్టు ఛాంపియన్‌షిప్ మొదలవ్వడం వల్ల ఈ మ్యాచ్ కీలకంగా భావిస్తున్నారు.