టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి అరుదైన గౌరవం దక్కింది. ఈ ఏడాది మేటి వ్యక్తిగా(పర్సన్ ఆఫ్ ద ఇయర్-2019) విరాట్‌ను ఎంపిక చేసింది జంతు హక్కుల సంరక్షణ సంస్థ పెటా. మూగజీవుల రక్షణకు కోహ్లీ చేసిన కృషికి గాను ఈ అవార్డు దక్కినట్లు పెటా భారతీయ డైరెక్టర్ సచిన్ బంగేరా తెలిపారు.
"విరాట్ జంతువుల పట్ల ఎంతో దయగా ఉంటాడు. మూగజీవాల హింసను అతడు అస్సలు ఉపేక్షించడు. జంతువుల సంరక్షణ కోసం పాటు పడే వారెవ్వరినైనా పెటా ఇండియా గౌరవిస్తుంది." - సచిన్ బంగేరా, పెటా ఇండియా డైరెక్టర్
శాకాహారిగా మారిన విరాట్ కోహ్లీ జంతువుల సంరక్షణ కోసం తన వంతు సాయం చేస్తున్నాడు. ఇటీవల అమేర్ ఫోర్ట్‌లో మాలతి అనే ఏనుగును హింసించిన 8 మందిపై చర్యలు తీసుకునేలా, వారి బారి నుంచి ఏనుగును కాపాడేందుకు పెటా తరఫున అధికారులకు లేఖ రాశాడు.
గతంలో ఈ అవార్డు కాంగ్రెస్ నేత శశి థరూర్, మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి కేఎస్ రాధాకృష్ణన్, నటి అనుష్క శర్మ, హేమ మాలిని, ఆర్.మాధవన్, జాక్వలిన్ ఫెర్నాండేజ్ తదితరులకు లభించింది.
ఇవీ చూడండి.. రిటైర్మెంట్పై లంక బౌలర్ మలింగ యూటర్న్