భారత్‌తో నిర్ణయాత్మక మ్యాచ్‌లో ఓడి, సిరీస్ కోల్పోయింది ఆస్ట్రేలియా. మూడు వన్డేల సిరీస్‌లో మొదటి మ్యాచ్ గెలిచిన, తర్వాత రెండింటిలో ఓటమి పాలైంది. మ్యాచ్ అనంతరం మాట్లాడిన ఫించ్.. కెప్టెన్ కోహ్లీని ఆకాశానికెత్తేశాడు. అత్యుత్తమ వన్డే క్రికెటర్ అంటూ కితాబిచ్చాడు. రోహిత్పైనా ప్రశంసలు కురిపించాడు.
"వారి(భారత్) వైపు విరాట్ కోహ్లీ లాంటి అత్యుత్తమ వన్డే క్రికెటర్ ఉన్నాడు. ఆ జాబితాలో టాప్-5లో ఉండే రోహిత్ కూడా ఉన్నాడు. వారు అసాధారణ బ్యాట్స్‌మెన్. కీలకమైన మ్యాచ్‌ల్లో సత్తా చాటుతూ జట్టుకు విజయాలు అందిస్తున్నారు. మరో ఓపెనర్ ధావన్ లేకపోయినా, రోహిత్ చాలా చక్కగా, అద్భుతంగా ఆడి సెంచరీ కొట్టాడు. అదే విధంగా డెత్ ఓవర్లలో భారత్ బౌలర్లు బాగా బౌలింగ్ చేశారు. గత కొద్ది మ్యాచ్‌ల నుంచి వారు బాగా రాణిస్తున్నారు" -అరోన్ ఫించ్, ఆస్ట్రేలియా కెప్టెన్
ఈ మ్యాచ్‌లో తమ ప్రణాళికను సరిగా అమలు చేయలేకపోయామని అన్నాడు ఫించ్
"తొలుత 300 పరుగులు చేయాలనుకున్నాం. ఆ ప్లాన్ అమలు కాలేదు. చివరి వరకూ స్పిన్‌కు అనుకూలంగానే ఉంది. కానీ మేం సాధించింది భారీ స్కోరు కాకపోవడం వల్ల మ్యాచ్‌ను కాపాడుకోలేకపోయాం" -ఫించ్, ఆస్ట్రేలియా కెప్టెన్
త్వరలో న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుంది కోహ్లీసేన. ఈనెల 24 నుంచి టీ20 సిరీస్ మొదలుకానుంది. ఆ తర్వాత వన్డేలు, టెస్టులు ఆడనుంది.