చారిత్రక డే/నైట్ టెస్టులో భారత బ్యాట్స్‌మెన్ ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, నిలకడగా ఆడుతున్నారు. వీరిద్దరూ ఇప్పటికే 50 పైచిలుకు పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు.
ఆరంభంలోనే మయాంక్ అగర్వాల్ ఔటైనా.. రోహిత్ శర్మ.. పుజారాతో కలిసి ఇన్నింగ్స్ ముందుకు నడిపించాడు. కానీ ఇబాదత్ హొస్సేన్ వేసిన బంతిని అంచనా వేయడంలో విఫలమై ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.
-
Milestone Alert🚨: @imVkohli completes 5000 Test runs as #TeamIndia captain. @Paytm #PinkBallTest #INDvBAN pic.twitter.com/fu7fozfoUu
— BCCI (@BCCI) November 22, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Milestone Alert🚨: @imVkohli completes 5000 Test runs as #TeamIndia captain. @Paytm #PinkBallTest #INDvBAN pic.twitter.com/fu7fozfoUu
— BCCI (@BCCI) November 22, 2019Milestone Alert🚨: @imVkohli completes 5000 Test runs as #TeamIndia captain. @Paytm #PinkBallTest #INDvBAN pic.twitter.com/fu7fozfoUu
— BCCI (@BCCI) November 22, 2019
ఈ పరిస్థితుల్లో బ్యాటింగ్‌కు వచ్చిన కోహ్లీతో కలిసి పుజారా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. బంగ్లా బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ మూడో వికెట్‌కు అర్ధశతకం భాగస్వామ్యం నమోదు చేశాడు.
కోహ్లీ 5 వేల పరుగులు..
వన్డే తరహాలో బ్యాటింగ్ చేస్తున్న విరాట్ స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. కెప్టెన్‌గా టెస్టుల్లో వేగంగా 5వేల పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా కోహ్లీ రికార్డు సృష్టించాడు. 86 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత అందుకున్నాడు భారత సారథి. మొత్తంగా విరాట్.. 84 టెస్టుల్లో 7100 పరుగులు చేశాడు. ఇందులో 26 శతకాలు, 22 అర్ధసెంచరీలు ఉన్నాయి.
106 పరుగుల బంగ్లా స్కోరును ఇప్పటికే అధిగమించిన భారత్.. ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది.
ఇదీ చదవండి: పింక్ టెస్టు: రోహిత్‌కు లైఫ్.. భారత్ స్కోరు 35/1