ETV Bharat / sports

స్కామ్​ కేసులో కోహ్లీ లగ్జరీ కారు సీజ్​! - kohli car in police station

టీమ్​ఇండియా సారథి విరాట్ కోహ్లీకి చెందిన ఓ లగ్జరీ కారును స్కామ్​ కేసులో భాగంగా మహారాష్ట్ర పోలీసులు సీజ్​ చేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే?

Kohli
కోహ్లీ
author img

By

Published : Dec 12, 2020, 11:44 AM IST

Updated : Dec 12, 2020, 12:51 PM IST

టీమ్​ఇండియా సారథి విరాట్ కోహ్లీకి చెందిన 'ఆడీ' లగ్జరీ కారు.. మహారాష్ట్రలోని ఓ పోలీస్​ స్టేషన్​లో చాలా కాలంగా దుమ్ముపట్టుకుపోయి శిథిలావస్థలో ఉంది. ఓ స్కామ్​ కేసులో భాగంగా అధికారులు ఆ వాహనాన్ని సీజ్​ చేసి అక్కడ ఉంచారు. అదేంటి కోహ్లీ కారు.. కేసులో ఇరుక్కుపోవడమేంటి? ఎలా, ఎప్పుడు జరిగింది అని ఆలోచిస్తున్నారా?

ఇదీ అసలు కథ

కోహ్లీ గ్యారేజ్​లో ఎన్నో లగ్జరీ కార్లు ఉంటాయి. అందులో 'ఆడీ ఆర్​ 8' మోడల్(2012)​ ఒకటి. అయితే కొన్నాళ్లు ఉపయోగించిన తర్వాత దాన్ని సాగర్ అనే బ్రోకర్​కు అమ్మేశాడు విరాట్. దాన్ని రూ.2.5కోట్లకు కొనుగోలు చేసిన సదరు బ్రోకరు రెండు నెలలలోనే ఓ స్కామ్​ కేసులో ఇరుక్కున్నాడు. ఇందులో భాగంగా పోలీసులు అతడి ఆస్తిని, కారును సీజ్​ చేశారు. అలా ఆ వాహనం అప్పటి నుంచి పోలీస్​ స్టేషన్​లోనే పడి ఉంది.

ఇదీ చూడండి : 'విరుష్క' వివాహ బంధానికి మూడేళ్లు.. జంట భావోద్వేగం

Last Updated : Dec 12, 2020, 12:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.