ETV Bharat / sports

ఐపీఎల్​లో కోహ్లీ, ధోనీ ముందున్న మైలురాళ్లు - ఐపీఎల్​లో ధోని చేరే మైలురాళ్లు

త్వరలో జరగనున్న ఐపీఎల్​ సీజన్​తో కెప్టెన్​ విరాట్​ కోహ్లీ, సీఎస్కే సారథి ధోనీ సరికొత్త మైలురాళ్లు చేరుకోనున్నారు. అవేంటో తెలుసుకుందాం..

kohli, dhoni have a chance to reach milestones
కోహ్లీ, ధోని చేరే మైలురాళ్లు
author img

By

Published : Apr 7, 2021, 5:30 AM IST

ఏప్రిల్​ 9 నుంచి ఐపీఎల్ 14వ సీజన్​​ మ్యాచ్​లు ప్రారంభం కానున్నాయి. ఇందులో రాయల్​ ఛాలెంజర్స్​ కెప్టెన్​ విరాట్​ కోహ్లీ, చెన్నై సూపర్​ కింగ్స్ సారథి ధోనీ సరికొత్త మైలురాళ్లను దాటనున్నారు.

  • ఈ సీజన్​తో ఆర్సీబీ కెప్టెన్​ విరాట్​ కోహ్లీ.. 200 ఐపీఎల్​ మ్యాచ్​లు ఆడి రోహిత్​, ధోనీ సరసన చేరనున్నాడు. ఇప్పటివరకు రోహిత్​ 200 ఐపీఎల్​ మ్యాచ్​లు ఆడగా.. ధోనీ 204 మ్యాచ్​లు ఆడాడు. 200 మ్యాచ్​లకు కోహ్లీ 8 మ్యాచ్​ల దూరంలో ఉన్నాడు.
  • ఐపీల్​లో ఇప్పటివరకు నాలుగు సెంచరీలు చేసిన కోహ్లీ.. అత్యధిక సెంచరీలు చేసిన క్రిస్​ గేల్​ రికార్డును చేరుకునే వీలుంది. గేల్​ ఇప్పటివరకు ఆరు సెంచరీలు చేశాడు. కోహ్లీ ఈ సీజన్​లో రెండు సెంచరీలు చేస్తే గేల్​ను సమం చేస్తాడు.
  • స్టైక్​ రేట్​ను పెంచుకునే అవకాశం కూడా కోహ్లీకి ఉంది. ఇప్పటివరకు 2016లో అత్యధికంగా 152.03 స్టైక్​ రేట్​ను నమోదు చేశాడు కోహ్లీ. ఆ తర్వాత నుంచి అతని స్టైక్​ రేట్​ తగ్గి.. ఇటీవల మళ్లీ పెరుగుతోంది.

చెన్నై సూపర్​ కింగ్స్​ సారథి ఎమ్ ఎస్​ ధోనీ.. ప్రస్తుత ఐపీఎల్​తో మూడు మైలురాళ్లను దాటనున్నాడు.

  • ఐపీఎల్​లో​ అత్యధిక స్కోర్​ చేసిన ఆటగాళ్ల జాబితాలో ఎనిమిదో స్థానంలో ఉన్న ధోనీ.. మరో 368 పరుగులు చేస్తే 5,000 పరుగుల మార్క్​ను అందుకోగలడు. విరాట్​ కోహ్లీ 5,878, సురేష్​ రైనా 5,368, వార్నర్​ 5,254లు మాత్రమే ఈ మార్క్​ను అధిగమించారు.
  • ఐపీఎల్​లో ధోనీ ఇప్పటి వరకు 215 సిక్స్​లు బాదాడు. ఈ సీజన్​లో రాణిస్తే సిక్స్​ల సంఖ్యను 250 సిక్సర్ల మార్కును అందుకోగలడు.
  • వికెట్​ కీపర్​గా ఇప్పటివరకు 148 మందిని పెవిలియన్​ బాట పట్టించాడు ధోనీ. మరో ఇద్దరు బ్యాట్స్​మెన్​ను ఔట్​ చేస్తే 150 మార్క్​ను అందుకుంటాడు.

ఇదీ చదవండి: 'జట్టులో అతనొక్కడికే.. మిగతావారికి నెగటివ్​'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.