ప్రపంచకప్ అనంతరం టీమిండియా.. వెస్టిండీస్‌తో టీ20, వన్డే, టెస్టు సిరీస్‌లు ఆడనుంది. అయితే, పరిమిత ఓవర్ల సిరీస్‌లకు కెప్టెన్ విరాట్ కోహ్లీ, స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినివ్వనున్నట్టు బీసీసీఐ ప్రకటించింది. ఆగస్టు 22 నుంచి జరిగే టెస్టు సిరీస్‌కు వీరు జట్టులోకి వస్తారని చెప్పింది.
"ఆస్ట్రేలియా సిరీస్ నుంచి విరాట్, బుమ్రా విశ్రాంతి లేకుండా మ్యాచ్‌లు ఆడుతున్నారు. ఇరువురిపై ఒత్తిడి తగ్గించాలనే ఉద్దేశంతో విరామం ఇస్తున్నాం. ఆగస్టు 22న ప్రారంభమయ్యే టెస్ట్ సిరీస్‌కు అందుబాటులో ఉంటారు" -బీసీసీఐ ప్రతినిధి
కరీబియన్ జట్టుతో మూడు టీ20లు, 3 వన్డేలు, రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది టీమిండియా. టీ20లు అమెరికాలోని ఫ్లోరిడాలో జరగనుండగా, వన్డే, టెస్టు మ్యాచ్‌లకు వెస్టిండీస్ ఆతిథ్యమివ్వనుంది. విండీస్‌తో జరిగే టెస్టు మ్యాచ్‌లతోనే ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ప్రారంభం కానుంది.
ఇది చదవండి: తండ్రి సినిమా షూటింగ్లో కొడుకు సందడి