సుదీర్ఘ ఫార్మాట్ క్రికెట్లో భారత జట్టు ఆధిపత్యం కొనసాగుతోంది. తాజాగా ఐసీసీ విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్‌లో... టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఇటీవల యాషెస్‌లో సత్తాచాటి నెంబర్ వన్‌కు చేరిన స్మిత్‌ను... రెండో స్థానానికి నెట్టేశాడు విరాట్. బౌలింగ్ విభాగంలో ముగ్గురు, ఆల్‌రౌండర్ల విభాగంలో ఇద్దరు టాప్-10లో ఉండటం విశేషం. ప్రస్తుతం 120 పాయింట్లతో భారత్ టాప్ జట్టుగా కొనసాగుతోంది.
పింక్ టెస్టు ప్రదర్శన...
ఈడెన్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన డే/నైట్ టెస్టులో.. కోహ్లీ 136 పరుగులతో రాణించాడు. ఈ ప్రదర్శన ఫలితంగా 928 పాయింట్లకు చేరాడు. ఆస్ట్రేలియా క్రికెటర్ స్మిత్.. ఇటీవల పాకిస్థాన్‌తో జరిగిన రెండో టెస్టులో 36 పరుగులే చేసి నిరాశపర్చాడు. ఫలితంగా 931 పాయింట్ల నుంచి 923 పాయింట్లకు పడిపోయాడు.
కోహ్లీతో పాటు ఛతేశ్వర పుజారా 4, అజింక్యా రహానే 6 ర్యాంకుల్లో నిలిచి టాప్-10లో చోటు దక్కించుకున్నారు. మయాంక్ అగర్వాల్ టాప్-10 నుంచి చోటు కోల్పోయాడు.
వార్నర్ 12 స్థానాలు..
ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ పాకిస్థాన్‌తో జరిగిన రెండో టెస్టులో ట్రిపుల్ సెంచరీ సాధించాడు. 335* పరుగుల వ్యక్తిగత అత్యధికం నమోదు చేశాడు. ఈ ప్రదర్శన కారణంగా 12 స్థానాలు ఎగబాకి.. టాప్-5లో చోటు దక్కించుకున్నాడు.
ఈ ఏడాది టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు, ఆస్ట్రేలియా క్రికెటర్ లబుషేన్.. కెరీర్ తొలిసారి టాప్-10లో స్థానం పొందాడు. గతేడాది 110వ ర్యాంక్‌లో ఉన్న అతడు.. ఒక్క ఏడాదిలోనే అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. పాకిస్థాన్‌కు చెందిన బాబర్ అజామ్ రెండు స్థానాలు ఎగబాకి... 13 ర్యాంక్ సాధించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో 97 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఇటీవలే 11వ ర్యాంక్‌కు పడిపోయిన ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్... న్యూజిలాండ్‌పై చేసిన 226 పరుగుల ప్రదర్శన ఫలితంగా 7వ స్థానం సంపాదించుకున్నాడు.
-
Virat Kohli back to No.1!
— ICC (@ICC) December 4, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
David Warner, Marnus Labuschagne and Joe Root make significant gains in the latest @MRFWorldwide ICC Test Rankings for batting.
Full rankings: https://t.co/AIR0KN4yY5 pic.twitter.com/AXBx6UIQkL
">Virat Kohli back to No.1!
— ICC (@ICC) December 4, 2019
David Warner, Marnus Labuschagne and Joe Root make significant gains in the latest @MRFWorldwide ICC Test Rankings for batting.
Full rankings: https://t.co/AIR0KN4yY5 pic.twitter.com/AXBx6UIQkLVirat Kohli back to No.1!
— ICC (@ICC) December 4, 2019
David Warner, Marnus Labuschagne and Joe Root make significant gains in the latest @MRFWorldwide ICC Test Rankings for batting.
Full rankings: https://t.co/AIR0KN4yY5 pic.twitter.com/AXBx6UIQkL
టాప్-10లో ముగ్గురు..
బౌలర్ల ర్యాంకింగ్స్‌లో ఆసీస్ ఆటగాడు కమిన్స్ అగ్రస్థానంలో ఉండగా.. భారత్ నుంచి బుమ్రా 5, అశ్విన్ 9, మహ్మద్ షమీ 10 ర్యాంకుల్లో నిలిచారు. ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్.. అడిలైడ్ టెస్టులో 7 వికెట్ల ప్రదర్శనకు గానూ 4 స్థానాలు ఎగబాకి 14వ ర్యాంక్‌కు చేరాడు.
ఆల్రౌండర్లలో టాప్-5లో ఇద్దరు..
ఆల్‌రౌండర్ల జాబితాలో వెస్టిండీస్ ఆటగాడు హోల్డర్.. 473 పాయింట్లతో నెంబర్ వన్‌గా కొనసాగుతున్నాడు. టీమిండియా నుంచి 406 పాయింట్లతో రవీంద్ర జడేజా 2వ స్థానంలోనూ, 308 పాయింట్లతో అశ్విన్ 5వ స్థానంలో ఉన్నారు.
ఇవీ చూడండి.. స్మిత్‌కు చెక్.. మళ్లీ నెంబర్ వన్ స్థానానికి కోహ్లీ