ETV Bharat / sports

స్విమ్​సూట్​లో ఓపెనర్​ కేఎల్​ రాహుల్​ ప్రేయసి! - కేఎల్​ రాహుల్​ అతియా శెట్టి లేటెస్ట్​ న్యూస్​

టీమ్ఇండియా ఓపెనర్​ కేఎల్​ రాహుల్​తో బాలీవుడ్​ నటి అతియా శెట్టి ప్రేమాయణం సాగిస్తుందని నెట్టింట ప్రచారం జరుగుతోంది. కానీ, వీటిపై వారిద్దరి నుంచి ఎలాంటి స్పందన లేదు. సోషల్​మీడియాలో రాహుల్​, అతియ పోస్టులను చూసి ఆ వార్తలు నిజమేనని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

KL Rahul's Comment On Athiya Shetty's Swimwear Pic Has Instagram Abuzz
స్విమ్​సూట్​లో ఓపెనర్​ కేఎల్​ రాహుల్​ ప్రేయసి!
author img

By

Published : Aug 20, 2020, 12:03 PM IST

బాలీవుడ్​ నటి అతియా శెట్టితో టీమ్ఇండియా క్రికెటర్​ కేఎల్​ రాహుల్​ డేటింగ్​లో ఉన్నాడని ప్రచారం జరుగుతోంది. తాజాగా అతియ ఇన్​స్టాగ్రామ్​ పోస్ట్​కు రాహుల్​ కామెంట్​ చేయడం వల్ల ఆ వార్తలకు బలం చేకూరుతోంది. స్విమ్​సూట్​లో ఉన్న మిర్రర్​ సెల్ఫీని అతియ ఇన్​స్టాలో పంచుకుంది. ఈ చిత్రానికి హార్ట్​ ఎమోజీతో 'జెఫా' అని కామెంట్​ చేశాడు రాహుల్​. దీని అర్థం ఏంటని కొందరు నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అయితే స్పానిష్​ భాషలో దానికి ' బాస్​' అని అర్థం.

KL Rahul's Comment On Athiya Shetty's Swimwear Pic Has Instagram Abuzz
అతియా శెట్టి ఇన్​స్టా పోస్ట్​పై కేఎల్​ రాహుల్​ కామెంట్​

'రాహుల్​ నా వాడు'

రాహుల్​, అతియ ప్రేమలో ఉన్నారని ప్రచారం జరుగుతున్నా.. వాటిపై ఈ జోడి నుంచి ఎటువంటి స్పందన లేదు. అయితే వారిద్దరి సోషల్​మీడియా పోస్టులు మాత్రం తరచూ వైరల్​ అవుతున్నాయి. ఇటీవలే రాహుల్​ పుట్టినరోజు సందర్భంగా అతియ శుభాకాంక్షలు తెలుపుతున్న పోస్టులో 'అతను నా వ్యక్తి' అని పేర్కొంది.

ఈసారి కెప్టెన్​గా..

ఈ ఏడాది ప్రారంభంలో న్యూజిలాండ్​ పర్యటనలో కేఎల్​ రాహుల్​ అద్భుతమైన ప్రతిభ కనబరిచాడు. యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్​లో కింగ్స్ ఎలెవన్​ పంజాబ్​ జట్టుకు ఈ సారి నాయకత్వం వహించబోతున్నాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.