ETV Bharat / sports

'బుమ్రాను తీసుకుందామని కోహ్లీకి చెప్పా' - కేఎల్​ రాహుల్​

భారత జట్టుకు వికెట్​ కీపర్​ కేఎల్​ రాహుల్​ ఉత్తమ ఎంపికని అభిప్రాయపడ్డాడు క్రికెటర్​ పార్థివ్​ పటేల్​. టీ20 ప్రపంచకప్​లో రాహుల్​ జట్టుకు ఎంతగానో ఉపయోగపడతాడని వెల్లడించాడు.

KL Rahul short-term solution if you are thinking of World Cup: Parthiv Patel
'బుమ్రాను తీసుకుందామని కోహ్లీకి చెప్పా'
author img

By

Published : May 21, 2020, 11:01 AM IST

Updated : May 21, 2020, 2:37 PM IST

టీమ్​ఇండియాలో వికెట్​ కీపర్​గా కేఎల్​ రాహుల్​ రాణించగలుగుతాడన్న అభిప్రాయం వ్యక్తం చేశాడు క్రికెటర్​ పార్థివ్​ పటేల్​. టీ20 ప్రపంచకప్​లో రిషబ్​ పంత్​ కంటే కేఎల్​ రాహుల్ ఎక్కువగా ఉపయోగపడతాడని అన్నాడు. ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

"ఈ సమయంలో కేఎల్​ రాహుల్​ జట్టులో ఉండటం ఉత్తమం. టీ20 ప్రపంచకప్​లో రాహుల్​ ఉత్తమ ప్రదర్శన చేయగలుగుతాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. పంత్ మంచి ఫామ్​లో ఉన్నాడు. తన లాగే నేను అదే వయసులో క్రికెట్​లో అడుగుపెట్టాను. అతడిలాగే నా కెరీర్​లో మంచి సిరీస్​లు ఎదురవ్వలేదు. కానీ, దేశవాళీ క్రికెట్​ నాకు చాలా సహాయపడింది. మనలో ప్రతిభ ఉన్నప్పుడే ప్రేక్షకులు మనపై విమర్శలు చేస్తారని.. మన దగ్గర ఆటతీరు సరిగా లేకపోతే అభిమానులు పట్టించుకోరని గతంలో పంత్​కు చెప్పాను".

-పార్థివ్ పటేల్​, ఆర్సీబీ వికెట్​ కీపర్​

టీమ్​ఇండియా ఫాస్ట్ ​బౌలర్​ జస్​ప్రీత్​ బుమ్రాను బెంగళూరు జట్టులోకి తీసుకుందామని కెప్టెన్ విరాట్​ కోహ్లీకి చెప్పినట్లు పార్థివ్​ పటేల్​ తెలిపాడు. అయితే అప్పటికే ముంబయి ఇండియన్స్​ అతడిని కొనుగోలు చేసిందని అన్నాడు.

ఇదీ చూడండి.. బెంగళూరు సాయ్​లో వంట మనిషికి కరోనా

Last Updated : May 21, 2020, 2:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.