ETV Bharat / sports

టీ20 సిరీస్​లో ఓపెనర్లుగా రోహిత్​, కేఎల్ రాహుల్​! - ఇండియా vs ఇంగ్లాండ్​ టీ20 సిరీస్​

ఇంగ్లాండ్​తో ఆడబోయే సిరీస్​లో టీమ్ఇండియా సెలెక్షన్​పై మాజీ సెలెక్టర్ దేవాంగ్ గాంధీ క్లారిటీ ఇచ్చారు. టీమ్​ఇండియా ఓపెనర్లుగా రోహిత్​శర్మ, కేఎల్​ రాహుల్​కు తొలి ప్రాధాన్యమని.. ధావన్​ను రిజర్వ్​ ఓపెనర్​గా ఎంపిక చేశారని స్పష్టం చేశారు.

kl rahul and rohit sharma are first choice openers says devang gandhi
టీ20 సిరీస్​లో ఓపెనర్లుగా రోహిత్​, కేఎల్ రాహుల్​!
author img

By

Published : Mar 11, 2021, 5:31 AM IST

బీసీసీఐ మాజీ సెలక్టర్‌ దేవాంగ్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌కు రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌ తొలిప్రాధాన్య ఓపెనర్లని పేర్కొన్నారు. టీ20 ప్రపంచకప్‌ దృష్ట్యా శిఖర్‌ ధావన్‌ను రిజర్వు ఓపెనర్‌గా ఎంపిక చేశారని అన్నారు. యువ క్రికెటర్‌ సూర్యకుమార్‌కు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని సూచించారు. ఇంగ్లాండ్‌తో పొట్టి క్రికెట్‌ సిరీస్‌కు ముందు ఆయన మాట్లాడారు.

"టీ20 ప్రపంచకప్‌ సమీపిస్తున్న వేళ కేఎల్‌ రాహుల్‌, రోహిత్‌శర్మ టీమ్‌ఇండియా తొలి ప్రాధాన్య ఓపెనర్లు. శిఖర్‌ ధావన్‌ రిజర్వు ఓపెనర్‌గా ఉంటాడు. తనవంతు వచ్చేదాకా అతడు ఎదురు చూడక తప్పదు. బహుశా వన్డేల్లో అతడికి చోటు దక్కొచ్చు. అదీ టీ20 ప్రపంచకప్‌నకు అదనపు సన్నద్ధతగా భావిస్తేనే."

- దేవాంగ్ గాంధీ, టీమ్ఇండియా మాజీ సెలెక్టర్​

తొలిసారి టీమ్‌ఇండియాకు ఎంపికైన సూర్యకుమార్‌ యాదవ్‌ పైన ఆయన ప్రశంసలు కురిపించారు. "ముంబయి ఇండియన్స్‌ విజయవంతం అవ్వడంలో సూర్యకుమార్‌ కీలక పాత్ర పోషించాడు. ఒక ప్రత్యేకమైన స్థానంలో బ్యాటింగ్‌ చేస్తూ పరుగుల వరద సృష్టించాడు. టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకొని ఆడిస్తే అతడికి ఎక్కువ అవకాశాలు ఇవ్వడం మంచిది. వన్డే సిరీసులోనూ అతడికి చోటివ్వాలి" అని అని గాంధీ సూచించారు. టీమ్‌ఇండియా బ్యాటింగ్‌ లైనప్‌లో సూర్యకు ఐదో స్థానం ఇవ్వాలన్నారు. రిషభ్ పంత్‌ను నాలుగో స్థానంలో పంపించాలని సలహా ఇచ్చారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.