టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు న్యూజిలాండ్ పేసర్ టిమ్ సౌథీ (99 వికెట్లు). బంగ్లాతో జరిగిన చివరి టీ20లో హుస్సేన్ వికెట్ తీసిన సౌథీ.. ఈ రికార్డును నమోదు చేశాడు. ఈ మ్యాచ్కు ముందు వరకు 96 వికెట్లతో ఉన్న సౌథీ.. తాజా మ్యాచ్లో మూడు వికెట్లతో మెరిశాడు.
శ్రీలంక బౌలర్ లసిత్ మలింగ 107 వికెట్లతో అగ్ర స్థానంలో ఉన్నాడు. పొట్టి ఫార్మాట్లో 100కు పైగా వికెట్లు తీసిన తొలి బౌలర్ కూడా మలింగనే కావడం విశేషం. సౌథీ తర్వాతి స్థానాల్లో అఫ్గానిస్తాన్ బౌలర్ రషీద్ ఖాన్(95), షకిబుల్ హసన్(92) ఉన్నారు.
బంగ్లాతో మ్యాచ్లో కివీస్ 65 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 10 ఓవర్లలో(వర్షం కారణంగా కుదించారు) 141 పరుగులు చేసింది. అనంతరం ఛేదనకు దిగిన బంగ్లా 76 పరుగులకే చాపచుట్టింది.
ఇదీ చదవండి: పంజాబ్ కింగ్స్: పేరు మారింది.. మరి రాత?