సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 151 పరుగుల లక్ష్యాన్ని 19.5 ఓవర్లలో ఛేదించింది.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ పరుగులు చేయడానికి కష్టపడింది. వార్నర్ అద్భుత పోరాటంతో 4 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. విజయ్ శంకర్ (26), పాండే (19), తక్కువ పరుగులకే వెనుదిరిగారు.
పంజాబ్ బౌలర్లు పొదుపుగా బౌలింగ్ చేశారు. ముజిబర్ రెహమన్, షమి, అశ్విన్ చెరో వికెట్ తీశారు.
రాహుల్, మయాంక్ అదరహో
151 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ ప్రారంభంలోనే గేల్ వికెట్ కోల్పోయింది. అనంతరం రాహుల్, మయాంక్ అగర్వాల్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ పరుగులు రాబట్టారు. ఇద్దరూ అర్ధశతకాలతో అదరగొట్టారు. రెండో వికెట్‌కు 114 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టు గెలుపునకు బాటలు వేశారు. 55 పరుగులు చేసి మయాంక్ ఔటయ్యాడు.
సన్ రైజర్స్ బౌలర్లు పంజాబ్ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయడంలో విఫలమయ్యారు. సందీప్ శర్మ 2 వికెట్లు తీయగా రషీద్ ఖాన్, సిద్ధార్థ్ కౌల్ చెరో వికెట్ తీశారు.
ఇవీ చూడండి.. 'విలియమ్సన్‌ను భయపెట్టిన బెయిర్‌స్టో'