టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఫుట్బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డోకు దగ్గరి పోలికలు ఉన్నాయని అంటున్నాడు క్రికెటర్ కరుణ్ నాయర్. వీరిద్దరూ ఆటలో ఎప్పుడూ టాప్లో ఉంటూ.. సహ ఆటగాళ్లకు స్ఫూర్తిగా నిలుస్తారని తెలిపాడు.
"విరాట్ కోహ్లీని అనుసరించాలని అందరూ అనుకుంటారు. ఎందుకంటే అతడు ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాడు. క్రికెటర్లందరికీ ప్రేరణగా నిలుస్తున్నాడు. పదేళ్లలో అతను ఏమి సాధించాడో అందరికీ తెలుసు. అందుకే ప్రతి ఒక్కరూ కోహ్లీని అనుసరిస్తున్నారు".
-కరుణ్ నాయర్, టీమ్ఇండియా క్రికెటర్
నాన్ క్రికెట్లో ఫుట్బాల్ ఆటగాడు రొనాల్డో అంటే అభిమానమని వెల్లడించాడు కరుణ్ నాయర్. "నాకు చాలా స్ఫూర్తినిచ్చే నాన్-క్రికెట్ అథ్లెట్ రొనాల్డో. మాంచెస్టర్ యునైటెడ్లో చేరినప్పటి నుంచి అతడ్ని అనుసరిస్తున్నా. ఓ సాధారణ వ్యక్తి ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాడిగా ఎదగడం ఎంతో ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఆ స్థానానికి వెళ్లడానికి అతడెంతో కృషి చేశాడు" అని తెలిపాడు.
ఇదీ చూడండి...