న్యూజిలాండ్ జట్టు కెప్టెన్ కేన్ విలియమన్స్ తొలిసారి తండ్రయ్యాడు. అతడి భార్య సారా రహీమ్ బుధవారం(డిసెంబరు 16) ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయంతో పాటు ఓ ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన కేన్.. చిన్నారి రాకతో చాలా ఆనందంగా ఉన్నానని చెప్పాడు.
తన భార్య ప్రసవించనున్న కారణంతోనే వెస్టిండీస్‌తో రెండు టెస్టుకు దూరమయ్యాడు. త్వరలో పాకిస్థాన్‌తో జరగబోయే టీ20 సిరీస్‌కు గైర్హాజరీ కానున్నాడు.
2015లో విలియమన్సన్, సారాకు వివాహమైంది. ఆమె నర్స్‌గా పనిచేస్తోంది. కేన్.. కివీస్ జట్టుకు, ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కెప్టెన్ బాధ్యతలు నిర్వర్తిస్తూ పేరు తెచ్చుకున్నాడు.