ETV Bharat / sports

కేన్ విలియమ్సన్​ రికార్డు డబుల్​ సెంచరీ - విలియమ్సన్ రికార్డు డబుల్ సెంచరీ

పాకిస్థాన్​తో జరుగుతోన్న రెండో టెస్టులో న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్ డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. ఫలితంగా పలు రికార్డులను కైవసం చేసుకున్నాడు.

Kane Williamson completes 7000 Test runs for New Zealand
కేన్ విలియమ్సన్​ డబుల్​ సెంచరీ
author img

By

Published : Jan 5, 2021, 12:23 PM IST

న్యూజిలాండ్ సారథి, టెస్టు నెంబర్​వన్ బ్యాట్స్​మన్ కేన్ విలియమ్సన్ బ్యాటింగ్ జోరు కొనసాగుతోంది. గతేడాదిని శతకంతో ముగించిన ఈ స్టార్ బ్యాట్స్​మన్ ప్రస్తుతం పాకిస్థాన్​తో జరుగుతోన్న రెండో టెస్టులో అద్భుత డబుల్ సెంచరీ చేశాడు. ఫలితంగా పలు రికార్డులను కైవసం చేసుకున్నాడు.

పాక్​తో జరుగుతోన్న రెండో టెస్టు మ్యాచ్ మూడో రోజు ఈ ఘనతను సాధించాడు విలియమ్సన్. హెన్రీ నికోలస్​తో కలిసి నాలుగో వికెట్​కు 369 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 157 పరుగులు చేసిన నికోలస్ మహ్మద్ అబ్బాస్ బౌలింగ్​లో వెనుదిరిగాడు. తర్వాత కూడా అదే జోరును కొనసాగించిన విలియమ్సన్​ టెస్టుల్లో నాలుగో డబుల్ సెంచరీ సాధించాడు. అలాగే కివీస్ తరఫున 7000 టెస్టు పరుగులు పూర్తి చేసుకున్న మూడో ఆటగాడిగా నిలిచాడు. పలు రికార్డులూ సాధించాడు.

Kane Williamson completes 7000 Test runs for New Zealand
కేన్ విలియమ్సన్
  • కనీసం వేయి పరుగులు సాధించిన బ్యాట్స్​మెన్ పరంగా చూసుకుంటే గత మూడేళ్ల నుంచి విలియమ్సన్ టెస్టుల్లో అత్యధిక సగటు (65.74)తో బ్యాటింగ్ చేస్తున్నాడు. బాబర్ అజామ్ (62.80), లబుషేన్ (58.81), నికోలస్ (53.53), స్టీవ్ స్మిత్ (52.62), కోహ్లీ (52.56) కూడా కేన్ తర్వాతే ఉన్నారు.
  • న్యూజిలాండ్ తరఫున వరుసగా మూడు టెస్టుల్లో సెంచరీ చేసిన నాలుగో ఆటగాడు కేన్. మార్క్ బుర్గెస్, రాస్ టేలర్, టామ్ లాథమ్ ఇతడి కంటే ముందున్నారు.
  • 2016 నుంచి 10కి పైగా టెస్టు సెంచరీలు చేసిన రెండో కెప్టెన్ విలియమ్సన్. ఇతడు 11 సెంచరీలతో ఉండగా, కోహ్లీ 16 శతకాలతో ముందున్నాడు.
  • నాలుగో వికెట్​కు కేన్, నికోలస్ నెలకొల్పిన 369 పరుగులు భాగస్వామ్యం న్యూజిలాండ్​కు అత్యుత్తమం. ఇంతకుముందు రాస్ టేలర్, జెస్సీ రైడర్ 271 పరుగులు జోడించారు.
  • విలియమ్సన్​కు ఇది నాలుగో డబుల్ సెంచరీ. కివీస్ తరఫున అత్యధికంగా నాలుగు ద్విశతకాలు చేసిన మెక్​కలమ్​ను సమం చేశాడు. టేలర్, స్టీపెన్ ఫ్లెమింగ్ మూడు డబుల్ సెంచరీలు చేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.