యాషెస్ మూడో టెస్టుకూ వరుణుడు అడ్డుతగిలాడు. వర్షం కారణంగా దాదాపు ఒక సెషన్ వృథా అయింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. ఆర్చర్, బ్రాడ్ బౌలింగ్ ధాటికి 25 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. రెండో టెస్టులో విజృంభించిన ఆర్చర్ ఈ మ్యాచ్‌లోనూ నిప్పులు చెరిగే బంతులతో కంగారూ బ్యాట్స్‌మెన్‌ను కంగారు పెట్టించాడు. ఫలితంగా 179 పరుగులకు ఆలౌటైంది ఆసీస్.
ఓపెనర్ డేవిడ్ వార్నర్ (61) కాసేపు ఇంగ్లీష్ బౌలర్లను అడ్డుకున్నాడు. గాయంతో మ్యాచ్‌కు దూరమైన స్మిత్ స్థానంలో జట్టులోకి వచ్చిన లబుషేన్ (74) మరోసారి ఆకట్టుకున్నాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 111 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మిగతా బ్యాట్స్‌మెన్ రాణించలేకపోయారు. ఖవాజా (8), మార్కస్ హరిస్ (8), హెడ్ (0), పైనే (11), వేడ్ (0) పెవిలియన్‌కు క్యూ కట్టారు.
ఆర్చర్ 45 పరుగులిచ్చి ఆరు వికెట్లు తీసి సత్తాచాటాడు. బ్రాడ్ రెండు, వోక్స్, స్టోక్స్ చెరో వికెట్ దక్కించుకున్నారు.
ఇవీ చూడండి.. తడబడిన భారత 'టాప్'- పోరాడిన రహానె