వెస్టిండీస్‌తో నేడు(జులై 16) జరగబోయే రెండో టెస్టు నుంచి ఇంగ్లాండ్ స్టార్ ఆల్‌రౌండర్ జోఫ్రా ఆర్చర్‌ను తప్పించారు. బయో సెక్యూర్ నిబంధనలను అతిక్రమించడమే ఇందుకు కారణం. ఫలితంగా రెండుసార్లు కొవిడ్ పరీక్షలు చేయడం సహా ఐదు రోజులు ఐసోలేషన్‌లో ఉండనున్నాడు. ఓల్డ్ ట్రాఫోర్డ్‌లోని ఈ మ్యాచ్‌లో ఆర్చర్ ఆడటం లేదని ఈసీబీ ఓ ప్రకటన విడుదల చేసింది.
ఈ విషయమై స్పందించిన ఆర్చర్.. తాను చేసిన పనికి క్షమాపణలు చెప్పాడు. తన చర్యల వల్ల వచ్చే పరిణామాలను పూర్తిగా అంగీకరిస్తున్నానని వెల్లడించాడు.
దాదాపు 117 రోజుల విరామం తర్వాత బయో సెక్యూర్ వాతావరణంలో మాంచెస్టర్‌లో ఇటీవలే తొలి క్రికెట్ మ్యాచ్(టెస్టు) జరిగింది. ఆతిథ్య ఇంగ్లాండ్‌పై 4 వికెట్ల తేడాతో వెస్టిండీస్ విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో పరుగుల సమర్పించిన ఆర్చర్.. రెండో ఇన్నింగ్స్‌లో 45 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు.
ఇవీ చదవండి: