ఇంగ్లాండ్ టెస్టు సారథి జో రూట్ మరో ఘనత సాధించాడు. టెస్టుల్లో తమ జట్టు తరఫున 8 వేల పరుగులు పూర్తి చేసిన ఏడో బ్యాట్స్మన్గా రికార్డు సృష్టించాడు.
శ్రీలంకతో తొలి టెస్టు ఆడుతూ రూట్ ఈ మార్క్ అందుకున్నాడు. ఇది అతడికి 98వ టెస్టు. ఇందులో భాగంగా శుక్రవారం రెండో రోజు ఆటలో తన 18వ సెంచరీ చేశాడు. మొత్తంగా ఈ పోరులో ద్విశతకం(228) బాది.. తన ఖాతాలో నాలుగో డబుల్ సెంచరీని వేసుకున్నాడు.
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 421 పరుగులకు ఆలౌటైంది. అంతకు ముందు శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 135 పరుగులకు ఆలౌట్ అయింది. ఫలితంగా ఇంగ్లీష్ జట్టు 286 పరుగుల ఆధిక్యంలో ఉంది.
-
8000 Test runs ✅
— England Cricket (@englandcricket) January 16, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
Fourth Test double century ✅ #SLvENG 👉 https://t.co/awwR0kldEx pic.twitter.com/eCx3g7uwek
">8000 Test runs ✅
— England Cricket (@englandcricket) January 16, 2021
Fourth Test double century ✅ #SLvENG 👉 https://t.co/awwR0kldEx pic.twitter.com/eCx3g7uwek8000 Test runs ✅
— England Cricket (@englandcricket) January 16, 2021
Fourth Test double century ✅ #SLvENG 👉 https://t.co/awwR0kldEx pic.twitter.com/eCx3g7uwek
ఇదీ చూడండి: కోహ్లీ వీడియోలతో టెక్నిక్స్ నేర్చుకుంటాను: రూట్