దేవ్‌ధర్ ట్రోఫీలో భాగంగా ఇండియా-ఏ,బీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో బీ-టీమ్ ఘనవిజయం సాధించింది. 303 పరుగులను ఛేదించే క్రమంలో.. ఇండియా-ఏ జట్టు తడబడింది. అయితే... ఆ జట్టుకు చెందిన బ్యాట్స్‌మెన్ జయదేవ్ ఉనద్కత్ రనౌటైన తీరు అందరిలో నవ్వులు పూయించింది. విచిత్రంగా అవుటై పెవిలియన్ చేరాడు.
ఏం జరిగింది..
44వ ఓవర్.. ఐదో బంతి.. షహ్బాజ్ నదీమ్ బౌలింగ్. క్రీజు నుంచి ముందుకొచ్చి బంతిని డిఫెన్స్ ఆడాడు ఉనద్కత్. కానీ మళ్లీ క్రీజులోకి వెళ్లడం మర్చిపోయాడు. బంతిని అందుకున్న ఫీల్డర్ కీపర్ పార్ధివ్ పటేల్‌కు త్రో వేశాడు. అంతే పార్ధివ్ వికెట్లను గిరాటేయగా.. అంపైర్ వేలెత్తాడు. ఇక ఆశ్చర్యపోవడం ఉనద్కత్ వంతైంది. నిరాశగా పెవిలియన్ చేరాడు. ఈ పూర్తి వీడియో మీకోసం.
-
Recording #24 from Batsmen on Vimeo.
" class="align-text-top noRightClick twitterSection" data="Recording #24 from Batsmen on Vimeo.
">Recording #24 from Batsmen on Vimeo.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన బీ-జట్టు 302 పరుగుల భారీ స్కోర్ సాధించింది. రుతురాజ్ గైక్వాడ్ (113), బాబా అపరాజిత్ (101) సెంచరీలతో మెరిశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్-ఏ జట్టు 194 పరుగులకే ఆలౌటైంది. సారథి హనుమ విహారి పోరాడి అర్ధసెంచరీ చేసినా ఫలితం లేకపోయింది.
ఇవీ చూడండి.. బుమ్రాను టీజ్ చేసిన ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్