వెస్టిండీస్‌తో జరుగుతోన్న రెండో టెస్టులో టీమిండియా ఆధిపత్యం చలాయిస్తోంది. రెండో రోజు 264 పరుగులతో ఆటను కొనసాగించిన కోహ్లీసేన 416 పరుగులకు ఆలౌటైంది. హనుమ విహారీ (111) అద్భుత శతకంతో సత్తాచాటాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన విండీస్ జట్టుకు ముచ్చెమటలు పట్టించాడు బుమ్రా.
ఆరంభం నుంచి పదునైన బంతులతో విండీస్ బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తించాడు. ఏడో ఓవర్లో క్యాంప్‌బెల్‌ను ఔట్ చేసి వికెట్ల వేట ప్రారంభించిన ఈ పేసర్.. తొమ్మిదో ఓవర్లో ఏకంగా హ్యాట్రిక్ సాధించాడు. డారెన్ బ్రావో (4), బ్రూక్స్ (0), ఛేజ్ (0)లను వరుస బంతుల్లో పెవిలియన్ చేర్చి కరీబియన్ జట్టును కోలుకోకుండా చేశాడు.
టెస్టు క్రికెట్లో భారత్ తరఫున ఇది మూడో హ్యాట్రిక్. ఇంతకుముందు హర్భజన్ సింగ్ ఆస్ట్రేలియాపై, ఇర్భాన్ పఠాన్ పాకిస్థాన్‌పై ఈ ఘనత సాధించారు.
రెండో రోజు ఆటముగిసే సమయానికి విండీస్ 7 వికెట్ల నష్టానికి 87 పరుగులు చేసింది. బుమ్రా 16 పరుగులిచ్చి ఆరు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.
ఇవీ చూడండి.. నిప్పులు చెరిగిన బుమ్రా.. విండీస్ విలవిల