ETV Bharat / sports

ఇంగ్లాండ్​ జట్టుకు వెస్టిండీస్ కెప్టెన్​ అభినందనలు - COVID-19

మూడు మ్యాచ్​ల టెస్టు సిరీస్​లో 2-1 తేడాతో విజయం సాధించిన ఇంగ్లాండ్​ జట్టుకు.. వెస్టిండీస్​ కెప్టెన్​ జేసన్​ హోల్డర్​​ అభినందనలు తెలిపాడు. ఈ సిరిస్​లో ఇంగ్లాండ్ ప్రదర్శన అద్భుతమని పేర్కొన్నాడు.

Jason Holder congratulates Stuart Broad on taking 500 wickets as England bag series 2-1
హోల్డర్​, వెస్టిండీస్​ కెప్టెన్​
author img

By

Published : Jul 29, 2020, 11:08 AM IST

ఓల్డ్​ట్రాఫోర్డ్​ వేదికగా వెస్టిండీస్​తో జరిగిన టెస్టు సిరీస్​లో.. ఇంగ్లాండ్​ 2-1 తేడాతో ట్రోఫీ సొంతం చేసుకుంది. ఫలితంగా చివరిసారి విజ్డెన్​ ట్రోఫీని కైవసం చేసుకుంది ఇంగ్లీష్​ జట్టు. ఈ సందర్భంగా వెస్టిండీస్​ కెప్టెన్ జేసన్​ హోల్డర్​.. ఇంగ్లాండ్​ జట్టుకు శుభాకాంక్షలు తెలిపాడు.

నిర్ణయాత్మక మూడో టెస్టు చివరి రోజు 500 వికెట్ల మార్కును చేరుకున్నందుకు స్టువర్ట్​ బ్రాడ్​నూ అభినందనించాడు. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ చేతిలో ఓటమి గురించి మాట్లాడుతూ.. పలు విషయాలు పంచుకున్నాడు హోల్డర్​.

హోల్డర్​, వెస్టిండీస్​ కెప్టెన్​

"నా జట్టుతో నేనెప్పుడూ నిరాశచెందలేదు. కాకపోతే మ్యాచ్​లో వచ్చిన ఫలితాలే కాస్త బాధనిపిస్తాయి. అవును.. నిజంగా ఇంగ్లాండ్​ చాలా బాగా ఆడింది. ఇక్కడికి వచ్చిన ఏ జట్టు కూడా ఇంగ్లాండ్​ను ఓడించలేదు. అందుకే, ఇలా డిబేట్​లో అటాక్​ చేస్తన్నా(నవ్వుతూ). కానీ, ఈ మ్యాచ్​లో ఇంగ్లాండ్​కు క్రెడిట్​ ఇస్తా. వాళ్లంతా అద్భుతంగా ఆడారు.

హోల్డర్, వెస్టిండీస్​ కెప్టెన్​

మరోవైపు తమ జట్టు ఆటతీరుతో పాటు, స్వదేశానికి దూరంగా ఆటటం వల్ల ఎదుర్కొన్న ఇబ్బందులపై స్పందించాడు హోల్డర్​. "మేము రెండు నెలలుగా ఇండోర్​లో ఉన్నాం. వాస్తవ జీవితానికి ఆటగాళ్లు దూరమయ్యారనే చెప్పాలి. ఇది నిజంగా మానసికంగా పెద్ద సవాలు. ఆటగాళ్లంతా దీనిని అనుభవించారు. కానీ, మా జట్టు కుర్రాళ్లు వాటన్నింటినీ తట్టుకొని అద్భుతంగా ఆటతీరు ప్రదర్శించారు." అంటూ పేర్కొన్నాడు హోల్డర్​.

Jason Holder congratulates Stuart Broad on taking 500 wickets as England bag series 2-1
స్టువర్ట్​ బ్రాడ్​

ట్రోఫీ కైవసం చేసుకున్న ఇంగ్లాండ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.