యాషెస్ సిరీస్ ఆరంభంలోనే ఆతిథ్య ఇంగ్లాండ్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు కీలక బౌలర్, సీనియర్ ఆటగాడు జేమ్స్ అండర్సన్ తర్వాతి రెండు టెస్టు మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశముంది. తొలి మ్యాచ్‌లో కేవలం 4 ఓవర్లే వేసి మైదానం వీడాడీ పేసర్. తొడ కండరాల గాయం కారణంగా మళ్లీ బౌలింగ్‌కు దిగలేదు.
గత వారం ఐర్లాండ్‌తో టెస్టులోనూ ఈ కారణంతోనే ఆడలేదు. యాషెస్ సిరీస్ ప్రారంభమయ్యే సమయానికి కోలుకున్నా.. మళ్లీ కండరాలు పట్టేయడం వల్ల మ్యాచ్ మధ్యలోనే మైదానాన్ని వీడాడు. ప్రస్తుతం ఇంకా గాయం నుంచి కోలుకోని అండర్సన్ తర్వాతి రెండు టెస్టుల్లోనూ ఆడేది అనుమానంగా కనిపిస్తోంది.
తొలి ఇన్నింగ్స్‌లో 122కే 8 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది ఆసీస్. ఆ సమయంలో స్మిత్(144) విజృంభించడం వల్ల 284 పరుగులు చేసింది. అండర్సన్ లాంటి సీనియర్ బౌలర్ ఉండుంటే కంగారూ జట్టును తక్కువ స్కోరుకే పరిమితం చేసేది ఆతిథ్య జట్టు.
స్మిత్ మినహా బ్యాటింగ్‌లో పెద్దగా రాణించని ఆసీస్... బౌలింగ్లోను ఆకట్టుకోలేకపోయింది. ఇప్పటికే 267 పరుగులు చేసిన ఇంగ్లీష్ జట్టు ఆసీస్ స్కోరును అధిగమించేందుకు 17 పరుగుల దూరంలో ఉంది. చేతిలో ఇంకా ఆరు వికెట్లు ఉన్నాయి.
ఇవీ చూడండి.. భారత్Xవిండీస్ 'టీ20': ఇవి తెలుసుకోండి