ETV Bharat / sports

మ్యాజిక్​ ట్రిక్​లతో కాలక్షేపం చేస్తున్న శ్రేయస్​ అయ్యర్​

స్వీయ నిర్బంధంలో ఉన్న టీమిండియా క్రికెటర్ శ్రేయస్​ అయ్యర్..​ ప్లేయింగ్ కార్డ్స్​తో మ్యాజిక్​ ట్రిక్​ చేసి అందరికీ వినోదాన్ని పంచుతున్నాడు. ఆ వీడియోను బీసీసీఐ ట్వీట్ చేసింది.

Iyer pulls out a magic trick amid COVID-19 pandemic
మ్యాజిక్​ ట్రిక్​లతో కాలక్షేపం చేస్తున్న శ్రేయస్​ అయ్యర్​
author img

By

Published : Mar 21, 2020, 3:52 PM IST

కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా పలు క్రీడాటోర్నీలు రద్దయ్యాయి. ఐపీఎల్​ ఏప్రిల్​ 15కు వాయిదా పడింది. ఈ వైరస్​ నియంత్రణలో భాగంగా క్రికెటర్లందరూ ప్రస్తుతం ఇంటికే పరిమితమయ్యారు. అయితే ఈ ఖాళీ సమయంలో వారికి నచ్చిన వ్యాపకాలతో గడుపుతున్నారు. ప్రస్తుతం స్వీయనిర్బంధంలో ఉన్న టీమిండియా బ్యాట్స్​మన్ శ్రేయస్‌ అయ్యర్‌, తనకు తెలిసిన మ్యాజిక్​ ట్రిక్స్​తో కాలక్షేపం చేస్తున్నాడు. సోదరితో కలిసి అతడు చేసిన కార్డ్​షో వీడియోను భారత క్రికెట్​ నియంత్రణ మండలి(బీసీసీఐ) ట్వీట్ చేసింది.

కరోనా​ నియంత్రణలో భాగంగా వీలైంనంత వరకు స్వీయనిర్బంధంలో ఉండాలని, అత్యవసరమయితే తప్ప బయటకు రావొద్దని కేంద్ర ప్రభుత్వం ప్రజలకు సూచించింది. ఈ వైరస్​ వల్ల ఇప్పటికే 11,000 మంది మరణించగా.. 2,50,000 మంది దీని బారిన పడ్డారు.

ఇదీ చూడండి.. రిజర్వ్​డే కోసం ఐసీసీకి క్రికెట్​ ఆస్ట్రేలియా వినతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.