ETV Bharat / sports

'కోహ్లీని ఔట్ చేయడం అద్భుతంగా అనిపించింది' - ipl 2019

సన్​ రైజర్స్​ పేసర్​ ఖలీల్​ అహ్మద్​.. 2019 ఐపీఎల్​కు సంబంధించి తనకు ఇష్టమైన సంఘటనను గుర్తుచేసుకున్నాడు. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్​లో విరాట్​ను ఔట్​ చేయడం అద్భుతమైన అనుభవమని తెలిపాడు.

'It was an amazing feeling to dismiss a world-class batsman like Virat Kohli': Khaleel Ahmed on his favourite IPL 2019 moment
'కోహ్లిని ఔట్​ చేయడం ఎంతో అద్భుతంగా అనిపించింది'
author img

By

Published : Aug 6, 2020, 5:53 PM IST

Updated : Aug 6, 2020, 6:03 PM IST

2019 ఐపీఎల్​లో తన ఫేవరెట్​ మూమెంట్​ను పంచుకున్నాడు సన్​ రైజర్స్​ హైదరాబాద్​ పేసర్​ ఖలీల్​ అహ్మద్​. రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు సారథి విరాట్​ కోహ్లీ వికెట్​ తీయడం అద్భుతంగా అనిపించిందన్నాడు. విరాట్​ లాంటి వరల్డ్​ క్లాస్​ బ్యాట్స్​మన్​ను ఔట్​ చేయడం ఎప్పుడూ సంతోషమేనని తెలిపాడు.

2019 ఐపీఎల్​ ద్వితీయార్ధంలో ఖలీల్​కు జట్టులో ఆడే అవకాశం లభించింది. దాన్ని సద్వినియోగం చేసుకుని 9 మ్యాచుల్లో 19 వికెట్లు తీశాడీ లెఫ్టార్మ్ పేసర్​.

ఈ సందర్భంగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్​ను గుర్తుచేసుకున్నాడు ఖలీల్​. తొలి ఓవర్​లోనే పార్థివ్​ పటేల్​ ఔట్​ అవ్వడం వల్ల క్రీజ్​లోకి వచ్చాడు కోహ్లీ. రెండో ఓవర్​లో ఖలీల్​ బౌలింగ్​లో ఓ ఫోర్​, ఓ సిక్స్​ దంచేశాడు. అయినప్పటికీ ఖలీల్​ ఏకాగ్రతను కోల్పోలేదు. అదే ఓవర్​ నాలుగో బంతికి స్లో లెన్త్​ బాల్​ వేశాడు ఖలీల్​. మరోమారు దూకుడు ప్రదర్శిద్దామనుకున్న విరాట్​.. కీపర్​ వృద్ధిమాన్​ సాహాకు దొరికిపోయాడు.

భారత క్రికెట్​ జట్టు పేస్​ విభాగంలో కీలక పాత్ర పోషించాలని కోరుకుంటున్నట్టు తెలిపాడు ఖలీల్​.

ఇదీ చూడండి:- 'ధోనీ క్రికెటర్​గా ఎదిగిన తీరు అద్భుతం'

Last Updated : Aug 6, 2020, 6:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.