ETV Bharat / sports

'ధోనీ జట్టులోకి వస్తే టాపార్డర్​లో పంపాలి' - dhoni latest news

టీమ్​ఇండియా సీనియర్​ క్రికెటర్​ మహేంద్రసింగ్ ధోనీ మళ్లీ జట్టులోకి రావడం కష్టమేనని తెలిపాడు మాజీ బౌలింగ్ కోచ్ వెంకటేశ్ ప్రసాద్. ఒకవేళ అతడు జట్టులో చోటు సంపాదిస్తే ఫినిషర్​గా కాకుండా టాపార్డర్​లో బ్యాటింగ్​కు పంపాలని సూచించాడు.

ధోనీ
ధోనీ
author img

By

Published : May 15, 2020, 6:15 AM IST

టీమ్​ఇండియా మాజీ కెప్టెన్​ ధోనీ కొంతకాలంగా క్రికెట్​కు దూరంగా ఉంటున్నాడు. చాలా మంది ఇక మహీ కెరీర్​ ముగిసినట్లేనని భావిస్తున్నారు. కొంతమంది మాత్రం ధోనీ జట్టులోకి వస్తాడని అంటున్నారు. తాజాగా ఈ విషయమై భారత జట్టు మాజీ బౌలింగ్ కోచ్ వెంకటేశ్ ప్రసాద్​ స్పందించాడు. ధోనీ ఒకవేళ జట్టులోకి వచ్చినా అతడిని ఫినిషర్​గా కాకుండా.. బ్యాటింగ్​ ఆర్డర్​లో ముందుగా పంపాలన్నాడు.

"ధోనీ జట్టులోకి రావడం చాలా కష్టమైన విషయం. దాదాపు ఏడాదిగా క్రికెట్​కు దూరంగా ఉండి మళ్లీ మైదానంలో అడుగుపెట్టడమనేది చాలా కఠినమైనది. అతడు ఫిట్​గా ఉన్నాడనడంలో సందేహం లేదు. కానీ 40ఏళ్లకు దగ్గరపడుతున్నపుడు ఆటపై దృష్టిసారించడం కష్టం. ఒకవేళ అతడు ఫిట్​నెస్ నిరూపించుకుంటే మేనేజ్​మెంట్ పునరాగమనంపై ఆలోచించాలి. ఒకవళ ధోనీని మళ్లీ జట్టులోకి తీసుకుంటే అతడిని ఫినిషర్​గా కాకుండా టాపార్డర్​లో ఆడించాలి. మూడు, నాలుగు స్థానాల్లో బ్యాటింగ్​కు దించాలి."

-వెంకటేశ్ ప్రసాద్, టీమిండియా మాజీ క్రికెటర్

కరోనా లాక్​డౌన్ కారణంగా ప్రస్తుతం ధోనీ కుటుంబంతో గడుపుతున్నాడు. అతడికి సంబంధించిన వీడియోలను ఎప్పటికప్పుడు సాక్షిసింగ్ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటుంది. ఈ వైరస్ ప్రభావం తగ్గాక ఐపీఎల్ నిర్వహణ సాధ్యమైతే ధోనీని మళ్లీ మైదానంలో చూడవచ్చు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.