ETV Bharat / sports

కోహ్లీ ఇకనైనా మేలుకో.. లేదంటే అంతే! - ప్రమాదంలో కోహ్లీ కెప్టెన్సీ

2018-19 ఆస్ట్రేలియా పర్యటనలో టీమ్‌ఇండియా చరిత్ర సృష్టించింది. కంగారూ గడ్డపై తొలిసారి టెస్టు, ద్వైపాక్షిక వన్డే సిరీస్‌ విజయాలను అందుకుంది. దీంతో అంతవరకూ ఏ భారత కెప్టెన్‌కు సాధ్యం కాని ఘనతను అందుకున్నాడంటూ కోహ్లి పేరు మార్మోగింది. కానీ రెండేళ్ల తర్వాత.. అదే ఆస్ట్రేలియాలో కోహ్లి నాయకత్వ వైఫల్యం చర్చనీయాంశం అవుతోంది. జట్టు వన్డే సిరీస్‌ కోల్పోవడంలో కెప్టెన్‌ పాత్రపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా విరాట్‌ నాయకత్వ సామర్థ్యం ప్రశ్నార్థకమవుతోంది.

kohli
కోహ్లీ
author img

By

Published : Dec 1, 2020, 7:55 AM IST

సవాళ్లంటే ఇష్టపడే కోహ్లి.. నాయకత్వాన్ని ఎప్పుడూ భారంగా భావించింది లేదు. పైగా కెప్టెన్సీ వల్ల బాధ్యత పెరిగి తన బ్యాటింగ్‌ మరింత మెరుగైందని అంటాడు. కెప్టెన్‌ అయ్యాక, కాకముందు అతడి బ్యాటింగ్‌ ప్రదర్శనను పరిశీలిస్తే ఇది నిజమే అని అర్థమవుతుంది. ఇక కెప్టెన్‌గా అతను 91 వన్డేల్లో 62 విజయాలు అందుకున్నాడు. విజయ శాతంలో (70.22) టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్లెవ్వరూ అతనికి దగ్గర్లో లేరు. టెస్టుల్లోనూ (55 మ్యాచ్‌ల్లో 33 విజయాలు) అతనే అగ్రస్థానంలో ఉన్నాడు. కానీ సారథిగా అతను విజయవంతం కావడానికి దోహదపడ్డ అంశాలు చాలానే ఉన్నాయి. విరాట్‌ కెప్టెన్‌గా పరుగులు చేస్తూ.. ముందుండి జట్టును నడిపించేవాడు. జట్టు కూడా బాగుండి, నిలకడగా ఆడుతూ వచ్చింది. చురుకైన క్రికెట్‌ బుర్ర ఉన్న ధోని కెప్టెన్సీ వదిలేశాక కూడా కోహ్లీకి సలహాలు, సూచనలిస్తూ అతనికి అండగా ఉండేవాడు. దీంతో తన కెప్టెన్సీ సాఫీగా సాగిపోయింది. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు.

కానీ ఇప్పుడు.. నిరుడు వన్డే ప్రపంచకప్‌ నుంచి నాయకత్వ వైఫల్యంపై చర్చ నడుస్తోంది. ఆ టోర్నీలో జట్టు సెలక్షన్‌, కూర్పు విషయంలో తప్పటడుగులే జట్టుకు కప్‌ను దూరం చేశాయనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇక ఈ ఏడాది ఆరంభంలో న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ను 0-3తో కోల్పోయిన టీమ్‌ఇండియా.. ఇప్పుడు ఆస్ట్రేలియాలో వన్డే సిరీస్‌ను చేజార్చుకోవడంతో విరాట్‌ కెప్టెన్సీ గురించి చర్చ ఊపందుకుంది. గతంలో జట్టు గొప్పగా ఆడి విజయాలు సాధించిందే తప్ప.. కెప్టెన్‌గా కోహ్లి ప్రభావం పెద్దగా లేదని.. జట్టు కష్టాల్లో ఉన్నపుడు అతను ఏమీ చేయలేకపోతున్నాడనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముందులా జట్టుకు విజయాలు అందించే కీలక ఇన్నింగ్స్‌లు అతనిప్పుడు ఆడట్లేదు. ఈ ఏడాది 4 టెస్టులు, 8 వన్డేలాడిన అతను ఒక్క శతకం కూడా చేయలేదు. ఆరు టీ20ల్లో ఒక్కసారి కూడా అర్ధసెంచరీని అందుకోలేదు. వ్యక్తిగత ప్రదర్శన పక్కనపెడితే కెప్టెన్‌గానూ జట్టుపై ప్రభావం చూపలేకపోతున్నాడు. ఫీల్డింగ్‌లో, బౌలింగ్‌లో అతను పెద్దగా ప్రణాళికలు, వ్యూహాలతో బరిలోకి దిగట్లేదనే సందేహాలు కలుగుతున్నాయి. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ చెలరేగిపోతున్నపుడు వారిని కట్టడి చేసే విషయంలో నిస్సహాయంగా కనిపిస్తున్నాడు. జట్టు వనరులను కూడా సరిగా ఉపయోగించకోవట్లేదు. సైని అంత ఫామలో లేకపోయినా, తొలి వన్డేలో ధారళంగా పరుగులిచ్చినా అతణ్నే కొనసాగించాడు. నటరాజన్‌ వైపు చూడలేదు. ఆ మ్యాచ్‌లో హార్దిక్‌ బౌలింగ్‌ గురించి ముందస్తు ప్రణాళికలు లేవు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో అతనికి బౌలింగ్‌ ఇచ్చాడు. బుమ్రా లాంటి బౌలర్‌ను కొత్త బంతితో కేవలం రెండు ఓవర్లు మాత్రమే వేయించాడు. వీటన్నింటి మీదా ఇప్పుడు చర్చ నడుస్తోంది.

మరి టెస్టుల్లో?: ఆస్ట్రేలియాతో తొలి టెస్టు తర్వాత కోహ్లి వ్యక్తిగత కారణం (ప్రసవ సమయంలో తన భార్య దగ్గర ఉండేందుకు)తో తిరిగి భారత్‌ రానున్నాడు. ఈ నేపథ్యంలో అతను వన్డే, టీ20 సిరీస్‌లో రాణించి, జట్టును విజయాల వైపు నడిపిస్తాడని.. సహచరుల్లో ఆత్మవిశ్వాసం నింపుతాడని అంతా అనుకున్నారు. కానీ ఇప్పటికే వన్డే సిరీస్‌ కోల్పోయిన జట్టు.. టీ20ల్లో గెలిచినా ఆ ప్రభావం పెద్దగా ఉండదు. దీంతో ప్రతిష్ఠాత్మకమైన టెస్టు సిరీస్‌కు ఎన్నో సమస్యలు, సవాళ్లతో టీమ్‌ఇండియా సిద్ధం కావాల్సి ఉంది. అతని గైర్హాజరీలో ఇంకా బలహీనపడే జట్టు.. ఆస్ట్రేలియాపై మిగతా మూడు టెస్టుల్లో ఎలా ఆడుతుందో ఏమో! మరోవైపు ఏదో ఒక ఫార్మాట్లోనైనా కోహ్లిని తప్పించి రోహిత్‌ శర్మకు కెప్టెన్సీ అప్పగించాలని ఎప్పటి నుంచో సాగుతున్న చర్చకు ఇప్పుడు మరింత బలం చేకూరుతోంది. ఐపీఎల్‌లో రోహిత్‌ అయిదు టైటిళ్లు గెలిస్తే, కోహ్లి ఒక్కటీ నెగ్గలేదు. ఇప్పుడు టీమ్‌ఇండియా కెప్టెన్‌గానూ కోహ్లి విఫలవుతుండడంతో రోహిత్‌ను వన్డేలు, టీ20ల్లో కెప్టెన్‌గా పరిణగించాలనే డిమాండ్‌ పెరుగుతోంది. ఈ చర్చకు తెరదించాలంటే కోహ్లి బ్యాట్స్‌మన్‌గా, కెప్టెన్‌గా తనదైన ముద్ర వేయాల్సిందే!

ఇదీ చూడండి : వన్డేల్లో భారత కెప్టెన్ కోహ్లీ మరో ఘనత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.