ETV Bharat / sports

బుల్లి పఠాన్​తో మాస్టర్ బ్లాస్టర్ సచిన్​​ బాక్సింగ్​ - pathan son video

దిగ్గజ సచిన్ తెందుల్కర్.. భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్​ కొడుకుతో బాక్సింగ్ చేస్తూ కనిపించాడు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్​గా మారింది.

irfan phatan son boxing with sachin
సచిన్​తో సరదాగా బుల్లి పఠాన్​ బాక్సింగ్​
author img

By

Published : Mar 9, 2020, 10:21 AM IST

పిల్లలతో ఆడుకోవడమంటే ఎవరికైనా సరదానే. వాళ్లతో ఆహ్లాదంగా గడిపేందుకు ఎంతగొప్పవారైనా సరే ఇష్టపడుతుంటారు. తమ హోదాను మర్చిపోయి వారితో కలిసిపోతారు. దిగ్గజ క్రికెటర్​ సచిన్​ తెందుల్కర్​కు ఇలాంటి అనుభవమే ఎదురైంది. టీమిండియా మాజీ ఆల్​రౌండర్​ ఇర్ఫాన్​ పఠాన్​ కుమారుడు ఇమ్రాన్​తో ఆహ్లాదంగా గడిపాడు. ఆ చిన్నారితో సరదాగా బాక్సింగ్​ చేశాడు. బుల్లి పఠాన్​ కండలు తనకంటే దృఢంగా ఉన్నాయని కితాబిచ్చాడు.

సచిన్​తో తన కొడుకు ఇమ్రాన్​ గడిపిన క్షణాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయన్నాడు పఠాన్. ఆ వీడియోను ట్వీట్ చేసి తన ఆనందాన్ని పంచుకున్నాడు.

రోడ్​ సేఫ్టీ సిరీస్​లో భాగంగా ముంబయిలో శనివారం జరిగిన విండీస్​ లెజెండ్స్​-ఇండియా లెజెండ్స్ మ్యాచ్​లో సచిన్ జట్టు విజయం సాధించింది. పఠాన్​.. ఈ మ్యాచ్​ ఆడాడు. ఆ సందర్భంగానే పై సంఘటన జరిగినట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి: హర్భజన్​కు చేదు అనుభవం.. కిట్​లో బ్యాట్ మాయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.